కెసిఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఆందోల్ మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. గౌరవప్రదమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సంక్షేమాన్ని కోరుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవాలి. కానీ అలా కాకుండా తెలంగాణ ఉద్యమానికి సారధ్యం వహించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ని మార్చరీలోకి త్వరలో పోతారు అంటూ మాట్లాడడం చాలా విచారించదగ్గ విషయం.
విజ్ఞత కలిగిన వ్యక్తులు ఎవరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడరు. కేసీఆర్ సీనియర్ నాయకుడే కాదు వయసులో కూడా రేవంత్ రెడ్డి కంటే చాలా పెద్దవారు. అతనికంటే ముందే ఎం ఎల్ ఏ గా ఎం పి గా కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి పట్ల గౌరవాన్ని ప్రదర్శించకుండా మాట్లాడటం సమంజసం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హితువు పలుకుతున్నా అని ఆయన అన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన వస్తున్నందున ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నాడో లేక ఇంకా ఇంకేమైన సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారో ఏం జరుగుతుందో అనే ముఖ్యమంత్రికే అర్థం కాని పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే కొన్ని రోజులు మెడిటేషన్ చేసి లేదా సెలవులు తీసుకుని మనసుకుదుట పడిన తర్వాతనే బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అని నేను సలహా ఇస్తున్నాను అని మాజీ ఎమ్మెల్యే క్రాంతి హితవు పలికారు. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను అని ఆయన అన్నారు.