29.7 C
Hyderabad
April 18, 2024 06: 51 AM
Slider విజయనగరం

సీఎం పర్యట‌నా సభా స్థలిని పరిశీలించిన డీఐజీ

DIG Rangarao

విజయనగరం జిల్లా గుంకలాంలో ఈ నెల 30న సీఎం పర్యటనకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లుగా విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు తెలిపారు. గుంకలాంలో ఇండ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం వస్తున్ననేపథ్యంలో విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు గుంకలాం గ్రామాన్నిసందర్శించి, సభాస్థలం, హెలిప్యాడ్, పార్కింగు స్థలాలు, పైలాన్ నిర్మాణం చేపడుతున్న ప్రాంతాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లును సమీక్షించారు. జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న భద్రతా ఏర్పాట్లును ఎస్ఈబి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీరావు, పార్వతీపురం ఒఎస్ డి ఎన్.సూర్యచంద్రరావు విశాఖ రేంజ్ డిఐజికి వివరించారు. హెలిప్యాడ్ నిర్మాణం చేపడుతున్న ప్రాంతాన్ని సందర్శించి, చుట్టూ బ్యారికేడింగు నిర్మించాలని, ఇసుక, దుమ్ము లేవకుండా చర్యలు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో సభా స్థలానికి వచ్చే అవకాశం ఉన్నందున వాహనాల పార్కింగుకు ప్రత్యేకంగా స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగు స్థలాలు ప్రజలకు ఇచ్చే ఇండ్ల స్థలాలకు దూరంగా పార్కింగ్ ఉండే విధంగా చూడాల్సిందిగా పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. సీఎం పర్యటనకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించిన తనకు నివేదించాల్సిందిగా పోలీసు
అధికారులను విశాఖపట్నం రేంజ్ డీఐజి రంగారావు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ బి అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు, ఒఎస్డీ ఎన్.సూర్యచంద్రరావు, విజయనగరం డీఎస్పీ అనిల్ పులిపాటి, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, ఎఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ ఎర్రంనాయుడు, రూరల్ సీఐ టిఎస్ మంగవేణి, ఆర్ ఐలు నాగేశ్వరరావు, కుమార్, ఈశ్వరరావు. ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కాలభైరవుడి ఆలయంలో క్షుద్రపూజల కలకలం

Satyam NEWS

తీన్మార్ మల్లన్న ను వెంటనే విడుదల చేయాలి

Satyam NEWS

పవన్‌ గురించి నిజమే చెప్పా: రేణూ దేశాయ్‌

Bhavani

Leave a Comment