36.2 C
Hyderabad
April 23, 2024 21: 33 PM
Slider జాతీయం

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా పాజిటీవ్

#Vijay Rupani

మునిసిపల్ ఎన్నికలలో ప్రచారం చేస్తూ ఒక్క సారిగా కుప్పకూలిపోయిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఇప్పుడు కరోనా పాజిటీవ్ వచ్చింది.

గుజరాత్ లోని వడోదరా మునిసిపాలిటీలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న విజయ్ రూపానీ ఒక్క సారిగా బహిరంగ సభలోనే కుప్పకూలిపోయారు.

దాంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అహ్మదాబాద్ లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు నేడు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.

64 సంవత్సరాల విజయ్ రూపానీ ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Related posts

పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్

Bhavani

యువతీ యువకుల ఉపాధి సాధికారతే ధ్యేయం

Satyam NEWS

దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలి

Satyam NEWS

Leave a Comment