39.2 C
Hyderabad
March 28, 2024 16: 41 PM
Slider ముఖ్యంశాలు

విజయసాయిరెడ్డికి నిజంగా కరోనా సోకిందా? లేదా?

#MP Vijayasaireddy

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి నిజంగానే కరోనా సోకిందా? ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందీ అంటే ఎంపి విజయ సాయి రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దంపతులు కనీసం మాస్కు కూడా పెట్టుకోలేదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ అన్నారు.

 క్వారంటైన్ లో ఉన్న రోగిని ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా సందర్శించ వచ్చా? అది కూడా సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులు అలాంటి పని చేయవచ్చా అని ఆయన ప్రశ్నించారు. కనీసం మూతికి మాస్క్, చేతికి గ్లోవ్స్, పిపిఈ లాంటివి ఏమి లేకుండానే?  ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే?

కరోనా రోగిని పరామర్శించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అసలు కొరోనా నేనా? లేక ఆస్పత్రిలో చేరిక వెనక మరేదైనా చిదంబర రహస్యం ఉన్నదా? ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? ఎటువంటి సంకేతాలు పంపదలచుకున్నారు ముఖ్య మంత్రి గారూ? అంటూ ఆయన ప్రశ్నించారు.

సామాన్య ప్రజలకు కరోనా సోకితే పరీక్ష చేయటానికి, బాధితుడిని క్వరంటెన్ కేంద్రానికి తీసుకెళ్లడానికి, అంబులెన్స్ లో ఎక్కించే పర్యవేక్షకులు, దూరం నించి వ్యాధి వ్యాప్తి నిరోధక రసాయనాలు పిచికారీ చేసే సిబ్బంది వరకూ అందరూ చేతికి గ్లోవ్స్, ముఖానికి మాస్క్, భౌతిక దూరం పాటిస్తూ, ఆపాద మస్తకం కవర్ చేసుకుంటూ విధులు నిర్వహిస్తుంటే నే కరోనా వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తోందని ఆయన అన్నారు.

మరీ రాష్ట్రాన్ని ఏలే ఏలికలకు ఈ నియమ నిబంధనలు ఏవీ పట్టవా? అసలు వర్తించవా? ఇది ఒక రకంగా కేంద్ర హోం శాఖ ఇచ్చిన కోవిద్ నియమ నిబంధనలు ఉల్లంఘస్తున్నట్లు కాదా ? అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ ప్రశ్నించారు. మరి దీనికి ఎవరిని బాధ్యులను చేయాలి? ఎవరిపై చర్యలు తీసుకోవాలి? ఇదేనా వ్యాధితో పోరాడే విధానం? ఇవేనా  వ్యాప్తి నిరోధానికి అవలంబించే చర్యలు? షేమ్ ఆన్ యువర్ పార్ట్ ఆండ్ పార్టీ ముఖ్యమంత్రి గారూ అని ఆయన ప్రశ్నించారు.

Related posts

ఏలూరు కార్పొరేషన్ కు ఐదుగురు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక

Satyam NEWS

పోలియో చుక్కలు వేసిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

నిన్న అడిగిన సంబంధంలేని ప్ర‌శ్న‌లు మ‌ళ్లీ అడిగారు

Satyam NEWS

Leave a Comment