39.2 C
Hyderabad
March 29, 2024 15: 31 PM
Slider గుంటూరు

పల్నాడుకు నీరు ఇచ్చేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు

gopireddy srinivasareddy

రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖతో కేంద్రం జోక్యం చేసుకొని కృష్ణా-గోదావరి రివర్ బోర్డ్ పరిధిలోకి తీసుకొస్తూ గెజిట్ విడుదల చేయటం చాలా సంతోషకరమని గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్రం అక్రమ నీటి వినియోగం వాస్తవమే అనిర కేంద్రం తేల్చి చెప్పిందని ఆయన అన్నారు. కృష్ణా-గోదావరి రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా,గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తిశాఖ సంయుక్త కార్యదర్శి గెజిట్‌ విడుదల చేయడం హర్షణీయమని ఆయన అన్నారు.

కృష్ణా బోర్డు పరిధిలోకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులున్న ప్రాజెక్టులు కృష్ణానదిపై 36, గోదావరిపై 71 ప్రాజెక్టులను బోర్డుల పరిధిలో కేంద్రం చేర్చడం ఏపికి మేలు చేస్తుందని ఆయన తెలిపారు.

ఇక ఉమ్మడి ప్రాజెక్ట్‌లు, సిబ్బంది అంతా బోర్డు పరిధిలోకే వస్తారని, కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రాజెక్ట్‌ల వద్ద భద్రత ఏర్పాటు చేస్తారని ఆయన వివరించారు.

ఈ చర్యలన్నీ పల్నాడు ప్రజల నీటి సమస్య పరిష్కారం దిశగా ఉన్నాయని ఆయన అన్నారు.

Related posts

కేసీఆర్ ఎమ్మెల్యే కొనుగోళ్లపై కూడా విచారణ చేపట్టాలి

Bhavani

ఘనంగా మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి ధ్వజారోహణం

Bhavani

కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి

Satyam NEWS

Leave a Comment