32.2 C
Hyderabad
March 28, 2024 23: 36 PM
Slider ముఖ్యంశాలు

ఆంధ్రప్రదేశ్ సిఎం వై ఎస్ జగన్ ఏమన్నారంటే

cm jagan

రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మనుషులుగా వేరుగా ఉంటూ, మనసులు ఒక్కటిగా ఈ కరోనా మీద పోరాడాల్సిన సమయమిది. భారతీయులుగా ఈ పోరాటం చేద్దాం. ఇక్కడే ఒక విషయం చెప్పాలి, ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్‌కు, ఒక కాంగ్రిగేషన్‌కు అనేక ప్రాంతాల నుంచి, కొన్ని దేశాల నుంచి ఆధ్యాత్మిక ప్రతినిధులు  హాజరయ్యారు.

ఆ ఆధ్యాత్మిక సమావేశానికి వచ్చిన ప్రతినిధుల్లో ప్రత్యేకించి విదేశీ ప్రతినిధుల్లో కొందరికి కరోనా ఉండటం, ఆ మీటింగ్‌కు వెళ్లిన మన దేశస్తులు, మన రాష్ట్రం వారికి కూడా కరోనా సోకడం దురదృష్ణకరమైన పరిణామం. ఇదే సంఘటన ఏ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలోనైనా జరగవచ్చు.

మన దేశంలో అనేకమంది ఆధ్యాత్మిక వేత్తలున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వేలు, లక్షల భక్తులున్న అనేకమంది, అన్ని మతాల్లోనూ పెద్దలున్నారు.

ఒక రవిశంకర్‌ గారి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గాని, జగ్గీవాసుదేవ్‌ గారి ఈషా పౌండేషన్‌లో గాని, మాతా అమృతానందమయి సభల్లో గానీ, లేదా ఒక పాల్‌ దినకరన్‌ గారి ఆధ్యాత్మిక కార్యక్రమంలో గానీ, లేదా జాన్‌ వెస్లీ గారు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో గానీ ఎవరైనా పాల్గొనవచ్చు.

ఎవరికైనా ఈ పరిస్దితి రావచ్చు. కాబట్టి ఇది ఎక్కడైన జరగవచ్చు. ఎక్కడ జరిగినా అదొక ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటనగా కాకుండా దురదృష్టకర సంఘటనగానే చూడాలే తప్ప, ఓ మతానికో, ఒక కులానికో దాన్ని ఆపాదించి వారేదో తప్పుచేసినట్టుగా, నేరం చేసినట్లుగా, కావాలని చేసినట్లుగా చూపడం, చూపే ప్రయత్నం  ఎవ్వరూ కూడా చేయకూడదు.

అలాంటి ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం, ఇలాంటి ప్రయత్నాలు మనమంతా ఒక్కటిగానే ఉన్నామని చెప్పేదానికి మంచి చేయవు. కరోనా బాధితులు మీద మనం ఈ సమయంలో చూపాల్సినది ఆప్యాయత. మనవాళ్లను మనం వేరుగా చూడకూడదు.

దురదృష్టవశాత్తూ జరిగిన ఈ సంఘటనకు ఫలానా మతం వారి మీద, మన వారి మీద ఒక ముద్రవేయటానికి ఎవరూ వాడుకోవద్దు. ఇది ఎవరికైనా జరిగే అవకాశమున్న సంఘటనగానే భావించాలి.  ఈ సమయంలో భారతీయలుమంతా ఒక్కటిగానే కనపడాలి, ఒక్కటిగానే ఉండాలి. కరోనా కాటుకు మందు లేదు.

కరోనా కాటుకు మతాల్లేవు.  కరోనా కాటుకు ధనిక, పేద అనే తేడా లేదు. కరోనా కాటుకు దేశాల కూడా డిఫరెన్సియేషన్‌ కూడా లేదు. యుద్ధంలో మన ప్రత్యర్ధి మన కంటికి కనిపించని కరోనా అనే ఒక వైరస్‌. దీనికి వ్యతిరేకంగా మనుషులుగా అందరం పోరాటం చేస్తున్నాం.

అందరం ఐక్యంగా ప్రపంచానికి, దేశానికి చాటిచెబుతాం. దేశ ప్రధాని కూడా ప్రధాని హోదాలో ఈ  మేరకే పిలుపునిచ్చారు.

5వ తేదీన తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు మనమంతా వెలిగించే దీపాలు కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు అనే సరిహద్దులు లేకుండా అందరం ఒకటే అనే సందేశాన్నిస్తూ వెలగాలి.

చీకటిని నింపుతున్న కరోనా మీద దివ్వెలు, దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌లు, సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులు నిజమైన వెలుగుకు నిజమైన అర్ధం తేవాలి. ఈ మెసేజ్‌ ఏ  పరిస్ధితులో ఇస్తున్నాం అన్నది ఇవాళ ఏ మీడియా ఛానెల్, టీవీ ఛానల్‌  చూసినా సోషల్‌ మీడియాలో పరిస్ధితులు చూసినా అందరికీ కూడా అర్ధమవుతుంది.

ఇక్కడ కావాల్సింది  ప్రతీ ఒక్కరు ఒకరికొకరు తోడుగా ఉండటం. మనలో మనం ఢిపరెన్షస్‌ తీసుకొని వచ్చి, మనమంతా మనలో మనం ఒక కరోనా లాంటి వైరస్‌ వచ్చి మనని డిఫరెన్షయేట్‌ చేసే పరిస్ధితుల్లోనికి తీసుకుపోకుండా ఉండటం. కాబట్టి అందరూ కూడా సహృదయంతో నేను చెప్పే ఈ విజ్ఞప్తిని తీసుకుంటారని, మనమివ్వబోయే  మెసేజ్‌ 5వ తారీఖున గొప్పగా దేశానికే ఆదర్శవంతంగా ఇవ్వగలుగుతామని చెప్పి చెపుతాఉన్నాం.

ఇక ఈ విషయమే కాకుండా ఈ కరోనా వైరస్‌ మీద ఫ్రంట్‌లైన్‌లో ఉంటూ  యుద్దం చేస్తా ఉన్న మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంటు, పోలీసు డిపార్ట్‌మెంటు, శానిటేషన్‌ వర్కర్స్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పంచాయితీరాజ్ డిపార్ట్‌మెంటులో ఉన్న శానిటేషన్ వర్కర్స్‌, ఫ్రంట్‌ లైన్‌లో ఉండి పోరాటం చేస్తా ఉన్న వీళ్లకు మోటివేషన్‌గా ఉండటం కోసం ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాం.

మిగతా స్టాప్‌లో ఉన్నవారందరికీ కూడా జీతాలు కాస్తా వాయిదా వేసే కార్యక్రమం అందరితో మాట్లాడిన తర్వాత వాళ్లని కూడా ఒప్పించి వాయిదా వేసుకునేదానికోసం వాళ్లను ఒప్పంచిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ కరోనా టైంలో వీళ్లకి మాత్రం అంటే మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంటు, శానిటేషన్, పోలీసుశాఖ మాత్రం మోరల్‌గా ఫ్రంట్‌ లైన్‌లో ఉన్నారు. వాళ్లని మనం ఏదన్నా మోటివేట్‌ చేసే దానిలో భాగంగా వీళ్లకు మాత్రం పూర్తి జీతాలు కష్టమనిపించినా కూడా ఈ నెలది, ఈ నెలకు సంబంధించినంత వరకు ఎలాంటి పోస్ట్‌ పోన్‌ మెంటు లేకుండా జీతాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Related posts

సి ఐ టి యు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మేడే

Satyam NEWS

తల్లీ బిడ్డల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు

Satyam NEWS

హోటల్ మా ఆహ్వానం ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment