27.7 C
Hyderabad
April 20, 2024 00: 33 AM
Slider మహబూబ్ నగర్

సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను పంపిణీ చేసిన మంత్రి

#niranjanreddy

ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలబడి, వారికి ఆర్థిక పరమైన తోడ్పాటును అందిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని ఎం.ఎల్.ఎ. క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలిచేందుకు, ఆడపిల్లల కళ్యాణానికి, నిరుపేదల వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందిస్తున్నదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రూ.2,32,26,912/- ల విలువ కలిగిన  (232) కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, రూ. 64,28,500/- లు విలువ కలిగిన (205) సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టీ, అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నదని ఆయన తెలిపారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి మంత్రి సహపంక్తి  భోజనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, అధికారులు, ప్రజా ప్రతినిధులు  పాల్గొన్నారు.

చెక్కులను అందజేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

వనపర్తి రాం నగర్ కాలనీ11 వ వార్డుకు చెందిన దామోదరరెడ్డి కి గత కొద్ది రోజుల క్రితం అనారోగ్య సమస్యతో శాస్త్ర చేయించుకోగా వనపర్తిలో 8000/- రూపాయల చెక్కును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా దామోదరరెడ్డి కి అందజేశారు.ఈ సందర్భంగా  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి బాధితుల తరపున  11 వ వార్డు ప్రజానీకం తరుపున నందిమల్ల సుబ్బు ధన్యవాదాలు తెలియజేశారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

గోపన్పల్లిలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam NEWS

ప్యాకేజీ- 27& 28 తో నిర్మల్ జిల్లా సస్యశ్యామలం

Satyam NEWS

విహారయాత్రలో విషాదం: నలుగురు గల్లంతు

Satyam NEWS

Leave a Comment