36.2 C
Hyderabad
April 23, 2024 21: 57 PM
Slider జాతీయం

అప్పుల బాధ తో కాఫీడే అధినేత ఆత్మహత్య

V G Siddarh

కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ, కాఫీ డే సామ్రాజ్యం , ఇరవై వేల ఎకరాల కాఫీ తోటల అధిపతి , ఎన్నో రియల్ ఎస్టేట్ ఆస్తుల అధిపతి అయిన వి జి సిద్ధార్థ్ మంగళూరు లో నేత్రావతి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం మంగుళూరు నేత్రావతి నది వంతెనపై వెళుతుండగా డ్రైవర్‌ని కారు పక్కకు ఆపాలని ఆదేశించారు. అనంతరం కారు దిగి వంతెనపై నడుచుకుంటూ వెళ్లారు. సాయంత్రం 6.30 గంటల వరకు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన కనిపించకుండా పోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే విషయాన్ని సిద్ధార్థ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. వెంటనే సమాచారం అందుకున్న దక్షిణ కన్నడ పోలీసులు నదీ తీరంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో నేత్రావతి నదిని జల్లెడ పడుతున్నారు. విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మంగళవారం ఉదయం ఎస్.ఎం కృష్ణ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ సైతం ఆయనను కలిశారు.

‘‘ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఆయన అదృశ్యమైనట్లు అందరూ భావించారు. కానీ… ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు. ఆత్మహత్యకు ముందు తన కేఫ్ కాఫీ డే బోర్డు మెంబర్స్ ని ఉద్దేశించి  ఆయన ఓ లేఖ రాశారు.

 ఆ లేఖ పూర్తి సారాంశం ఇదే…

‘‘37 సంవత్సరాలపాటు  బలమైన నిబద్ధతతో.. హార్డ్ వర్క్ చేశాను. దాని కారణంగానే మా కంపెనీలలో, దాని అనుబంధం సంస్థలలో  30వేల మందికి ప్రత్యక్షంగా, 20వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించాను. ఈ కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి దీనికి లార్జెస్ట్ స్టాక్ హోల్డర్ గా నేనే ఉన్నాను. అయితే ఇప్పుడు ఎంత ప్రయత్నించినా… లాభాలు సాధించలేకపోతున్నాను. లాభదాయక వ్యాపారాన్ని సృష్టించడంలో విఫలమౌతున్నాను. చాలా కాలంగా దీని కోసం పోరాడుతూనే ఉన్నాను. ఇక నాకు పోరాడే ఓపిక లేదు. అందుకే అన్నీ వదిలేస్తున్నాను.

ఈ వత్తిడిని నేను తట్టుకోలేను

 ప్రైవేట్ ఈక్విటీ పార్ట్ నర్స్ షేర్లను బై బ్యాక్ చేయమని నాపై ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడిని ఇక నేను తట్టుకోలేను. ఆదాయపన్ను మాజీ డీజీ నుంచి కూడా ఎన్నో వేధింపులకు ఎదుర్కొన్నాను. నాపై ఇప్పటి వరకు మీరు ఎంతో నమ్మకం ఉంచారు. దానిని నిలబెట్టుకోలేక పోయినందుకు క్షమించండి. కొత్త యాజమాన్యంతో మీరుంతా మళ్లీ వ్యాపారాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈ తప్పులన్నింటికీ నాదే బాధ్యత. నా లావాదేవీల గురించి మా మేనేజ్ మెంట్ కీ, ఆడిటర్లకు తెలీదు. వాటిన్నింటికీ నేనే జవాబుదారిని. నేను ఎవరినీ మోసం చేయాలని అనుకోలేదు. మీరంతా ఈ విషయం అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇట్లు మీ వీజీ సిద్ధార్థ్’’ అంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

Related posts

ఉత్తమ సేవలు అందించడం ద్వారానే పోలీసులకు మంచి పేరు

Bhavani

గుడ్ న్యూస్: కరోనాను జయించిన యవకుడికి స్వాగతం

Satyam NEWS

సంచలనం కలిగిస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

Satyam NEWS

Leave a Comment