రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం దృష్ట్యా లాక్ డౌన్ ప్రకటించినా జనం రోడ్లపైకి రావడం మానలేదు. ఇదే విషయం రాజన్న సిరిసిల్లా జిల్లా కలెర్టర్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కరోనా వైరస్ నేపధ్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చ్ 31 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించగా జిల్లా కేంద్రంలోని రోడ్ల పై వాహనాలు,ప్రజలు అధిక సంఖ్యలో ఉండడం పై కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎక్కువ సంఖ్యలో వాహన దారులు రోడ్ల పై వెళ్తుంటే ఎం చేస్తున్నారని పట్టణ సీఐ వెంకట నర్సయ్య పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా కలెక్టర్ వాహనాలను ఆపి ప్రజల పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. చేసేది ప్రజా భద్రత కోసమేనని, ప్రజలే సహకరించకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా కారణం లేకుండా రోడ్లపై వచ్చిన వాహనాలను పోలీస్ స్టేషన్ కి తరలించుమని పోలీసులకు సూచించారు.