28.7 C
Hyderabad
April 20, 2024 08: 51 AM
Slider నిజామాబాద్

కలెక్టర్ గారూ.. రైతులపై కక్ష ఎందుకు..?: బీజేపీ నేత కాటిపల్లి ప్రశ్న

#bjpkamareddy

వేలాదిగా రైతుల సమస్యలు ఉంటే కలెక్టర్ గారికి రైతులపై ఇంత కక్ష్య ఎందుకు అని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. ధరణితో రైతుల గోస పేరుతో చేపట్టిన నిరాహార దీక్ష రెండవ రోజు కొనసాగింది. వివిధ గ్రామాల నుంచి అమావాస్య పండగ అయినా రైతులు అధిక సంఖ్యలో దీక్ష శిబిరానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్బంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. దీక్ష చేస్తున్న విషయం తెలుసుకుని రైతులు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని తెలిపారు.

ప్రతి వారం ప్రజావాణి కి వచ్చే దరఖాస్తులు చూడాలని కలెక్టర్ కు సూచించారు. కలెక్టర్ కు రైతులపై ఇంత కక్ష్య ఎందుకో అర్థం కావటం లేదనీ, ఒక వైపు రైతులు సమస్యలతో సతమవుతుంటే కనీస స్పందన కరువైందని అన్నారు. 2 రోజుల్లో దాదాపు 5600 ధరకాస్తు తన వద్దకు వచ్చాయని, వాళ్ళలో చాలా మంది ప్రజావాణి లో దరఖాస్తు చేసుకున్న వాల్లేనన్నారు. ప్రతి వారం ప్రజా వాణికి వచ్చే దరఖాస్తులు చూస్తే రైతుల సమస్య ఏంటో అర్థం అవుతదన్నారు. దాదాపు 5 రోజులుగా నిరసన, నిరాహార దీక్షలు కొనసాగుతున్నా అధికారుల నుంచి కనీస స్పందన లేదని వాపోయారు. కలెక్టర్ స్పందించి సమస్యలకు పరిష్కారం వచ్చే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని చెప్పారు. నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్షగా మారకముందే స్పందిచాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నాగుల్ మీరా,శివ శంకర్ యాదవ్,నాగు నాయక్,వెంకటేష్ నాయక్,నక్కని నరేష్,సాయిబాబా, సైదిరెడ్డి,శ్రీకాంత్,సైదులు ముదిరాజ్, మహేందర్ రెడ్డి,వెంకన్న,సాయి,నాగరాజు, ఓజో ఫౌండేషన్ ప్రతినిధులు,మండలి సభ్యులు,పిల్లుట్ల రఘు అభిమానులు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒక్కరోజులో 10వేలు దాటిన కరోనా కేసులు

Bhavani

రానున్న రెండు వారాలు అత్యంత కీలక సమయం

Satyam NEWS

అందుబాటులోకి రానున్న కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు

Murali Krishna

Leave a Comment