37.2 C
Hyderabad
April 19, 2024 11: 53 AM
Slider నిజామాబాద్

ఆస్తుల నమోదులో పురోగతి సాధించాలి

#KamareddyCollector

వ్యవసాయేతర ఆస్తుల నమోదులో పురోగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ ఎ. శరత్ అన్నారు. శనివారం  అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గ్రామాల వారిగా ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ప్రతి హ్యాబిటేషన్లో ఆస్తుల నమోదు 100% జరిగే విధంగా చూడాలని కోరారు. ఆదివారం ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఉండి సర్వేను పూర్తిచేయాలని  ఆదేశించారు. తండ్రి మృతి చెందితే ఆయన ఆస్తిని వారసుల పేరిట నమోదు చేయాలని సూచించారు.

గ్రామాల్లోని కంపోస్టు షెడ్లు వినియోగంలోకి వచ్చే విధంగా చూడాలని పేర్కొన్నారు. సేంద్రియ ఎరువులు తయారు చేసి రైతులకు విక్రయించాలని కోరారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోకుండా చూడాలన్నారు.

అసంపూర్తిగా ఉన్న స్మశాన వాటికలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలు ఎండిపోకుండా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ , డిపిఓ నరేష్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

Related posts

డ్రైనేజి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Satyam NEWS

కరోనా సమయంలో సేవలు అందించిన R.M.P,P.M.Pలను గుర్తించాలి

Satyam NEWS

టీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి

Satyam NEWS

Leave a Comment