27.7 C
Hyderabad
March 29, 2024 04: 49 AM
Slider వరంగల్

ఆరోగ్యంగా ఉంటే కరోనా ఏమీ చేయదు

#MahaboobabadCollector

కరోనా వైరస్ ఉన్న మనుషులు ఆరోగ్యంగా ఉంటే ఏమీ కాదని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ధైర్యం చెప్పారు. శనివారం కలెక్టర్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను ఆకస్మికంగా సందర్శించారు.

ఏరియా హాస్పిటల్ పనితీరును ప్రాంగణంలో  ఏర్పాటుచేసిన హోమ్ ఐసోలేషన్ పనితీరును డాక్టర్ భీమ్ సాగర్ తో కలిసి పర్యవేక్షించారు. కోవిడ్ టెస్ట్ ల వివరాలు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ప్రతిరోజు నిర్వహిస్తున్న  కోవిద్ టెస్ట్ లు లక్ష్యంగా పెట్టుకున్నా కరోనా  వైరస్ లక్షణాలు ఉన్నవారికి తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు.

అనంతరం కలెక్టర్ ఏరియా హాస్పిటల్ కోఆర్డినేటర్ భీమ్ సాగర్ తో పిపి కిట్ ధరించి కోవిద్ పేషెంట్లను పరామర్శించారు. కోవిద్  వైద్యంపై  కలెక్టర్  పేషెంట్ల  ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా  కోవిడ్ పేషెంట్ లు  వివరిస్తూ ప్రభుత్వ వైద్యులు అందుబాటులోనే ఉంటున్నారని, వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఏమీ లేవని  కలెక్టర్ కు వివరించారు.

ఆరోగ్య విషయంలో ఇకనైనా అశ్రద్ధ తగదని, ఇప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకొని కరోనాను జయించాలని కలెక్టర్ కోరారు.

ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న డాక్టర్లకు  తెలియ చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

“ఎర్రగుడి” నిర్మాణం 70 శాతం పూర్తి

Satyam NEWS

విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడానికి రాందేవ్ రావు ట్రస్ట్ ఆసుపత్రి

Satyam NEWS

మల్దకల్ మండల బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నిక

Satyam NEWS

Leave a Comment