బిచ్కుంద మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్య అమలులో భాగంగానే గురుకుల, కస్తూర్భా గాంధీ పాఠశాలలో ఆంగ్ల మద్యం విద్యను ప్రవేశపెట్టి జూనియర్ కళాశాల స్థాయికి పెంచిందన్నారు.
బిచ్కుందలో కళాశాల ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పిటిసి భారతి రాజు, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సాయవ్వ సాయిరామ్, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, పాఠశాల ప్రత్యేక అధికారిణి రాగిణి, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.