ఏపీలో కూటమి ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విజయనగరం రాజీవ్ కాలనీ ఇంటర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ డా.బీ.ఆర్.అంబేద్కర్ లాంఛనలంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఐవీపీరాజు, ఆ పార్టీ రాష్ట్ర మహిళా నేత అనూరాధ బేగం,ప్రసాదుల లక్ష్మీవర ప్రసాద రావు, ఆల్తి బంగార్రాజు,అలాగే బీజీపే నేతలు శివ ప్రసాద్ రెడ్డి,రాష్ట్ర తూర్పు కాపు చైర్మర్ పాలవలస యశస్విలు కూడా పాల్గొన్నారు.ఈ సందర్బంగా కళాశాల విద్యార్దులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్దులు మత్తు పదార్ధాలకు అలవాటు పడొద్దని హితువు పలికారు.గంజాయి కి అలవాటు పడిన బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకొవద్దన్నారు. కన్నవారి ఆశయాలు తూట్లు పొడవద్దని తరువాతి తరం పిల్లలకు మీరు ఆదర్శంగా ఉండాలని అన్నారు…జిల్లా కలెక్టర్ డా.బీ.ఆర్.అంబేద్కర్,సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కళాశాల స్టూడెంట్స్ ఉపయోగించుకోవాలని అలాగే పేద విద్యార్దులకు ఈ పథకం ఓ వరమని కలెక్టర్ అన్నారు. అక్షయ పాత్ర సౌజన్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అములోకి తీసుకొచ్చిందని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు.