30.7 C
Hyderabad
April 19, 2024 09: 38 AM
Slider ప్రపంచం

హైదరాబాద్ నుంచి కొలంబోకు డైరెక్ట్ విమాన సర్వీసులు పున:ప్రారంభం

#colombo

GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) నుంచి ఈ రోజు శ్రీలంకలోని కొలంబోకు నేరుగా విమాన సర్వీసును పున:ప్రారంభమయ్యాయి. దాదాపు ఒక సంవత్సరం,  ఏడు నెలల విరామం తరువాత, శ్రీలంక ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుండి సర్వీసును తిరిగి ప్రారంభించింది. ఉదయం 9.55 గంటలకు హైదరాబాద్ నుండి కొలంబోకు 120 ప్రయాణీకులతో విమానం బయలుదేరింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, శ్రీలంక ఎయిర్ లైన్స్ ఉన్నతాధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. హైదరాబాద్ – కొలంబో మధ్య వారానికి రెండుసార్లు – సోమవారం , శుక్రవారం – విమానాలు నడుస్తాయి. 

జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సిఇఒ  ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, ” అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటైన శ్రీలంకకు వెళ్లడానికి ప్రయాణికులంతా ఇష్టపడతారు. హైదరాబాద్-కొలంబోలను కలిపే ఈ నాన్‌స్టాప్ సర్వీసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులను శ్రీలంకలోని అనేక అందమైన గమ్యస్థానాలకు చేరవేస్తుంది అని అన్నారు.

Related posts

కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం

Bhavani

విద్యారంగంలో చంద్రబాబు విజన్‌… దేశంలోనే నెంబర్‌ వన్‌..!!

Satyam NEWS

మంచినీటి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

Satyam NEWS

Leave a Comment