39.2 C
Hyderabad
April 25, 2024 16: 58 PM
Slider ముఖ్యంశాలు

సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి రంగుపడింది!

#Supreme Court of India

ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పోలిన రంగులు వేయడంపై భారత దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండో సారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలపై వేసిన వైసీపీ జెండా రంగులను తీసివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ వై ఎస్ జగన్ ప్రభుత్వం మరో రంగును చేరుస్తూ ఇంకో జీవో ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ జీవో అంశంపై మళ్లీ విచారణ జరిపిన ఏపి హైకోర్టు జీవోను కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, పంచాయితీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, పంచాయితీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ పై కోర్టు ధిక్కార కేసు నమోదు చేశారు.

ఆ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రంగుల విషయంలో కేసు ఫైల్ చేసింది. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున రాష్ట్ర హైకోర్టు తమ కోర్టు ధిక్కార కేసును తాత్కాలికంగా పక్కన పెట్టింది. సుప్రీంకోర్టు తన తీర్పులో క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులను నాలుగు వారాలలో తొలగించాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు బెంచ్ కేవలం రెండు పేజీలలో తీర్పు ఇచ్చింది. మొదటి సారి హైకోర్టు రంగుల జీవోను కొట్టేసినప్పుడు కూడా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

అప్పుడు రాష్ట్ర హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది. ఇప్పుడు రెండో సారి కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు వాదననే సమర్ధించినట్లు అయింది. దీంతో వైసీపీ రంగులను రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Related posts

మత్స్యకారుల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అత్తిలి అప్పారావు మృతి

Satyam NEWS

‘అల్లుడు అదుర్స్’ జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌

Sub Editor

Leave a Comment