32.2 C
Hyderabad
April 20, 2024 19: 07 PM
Slider రంగారెడ్డి

రండి తరలి రండి మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి

రండి తరలిరండి మీ ఆరోగ్యాన్ని ఉచితంగా పరీక్షించుకోండని ఉప్పల వెంకటేష్ పిలుపునిచ్చారు.రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలోని మంగళపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం నవంబర్ 26న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మనిషి జీవితంలో విలువైనది ఆరోగ్యమని అది లేకుంటే జీవన మనుగడ సాగదని ఎన్ని లక్షల కోట్లు వెచ్చించిన ఆరోగ్యం సంపాదించుకోవడం ఎవరి తరం కాదని అటువంటి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిదని మీ ఆరోగ్యం మీ చేతిలో నేనని ఉచిత ఆరోగ్య శిబిరాన్ని వినియోగించుకొని ఉచిత మందులు స్వీకరించి ఆరోగ్యంగా జీవించాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రస్తుత కాలంలో కల్తీ ఆహారంతో , వాయు కాలుష్యం, మొదలగు కారణాలవల్ల మనిషి ఆయుష్షు ప్రమాణం తగ్గుతూ వస్తుంది.కిడ్నీలకు , గుండెపోటు, లివర్ ముఖ్యమైన అవయవాలకు సంబంధించిన రోగాలు, రక్త పోటు చక్కెర వ్యాధులతో చాలామంది బాధపడుతూ అనారోగ్యంతో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఎప్పుడో గుర్తించారని అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

ఆరోగ్యం కోసం తన వంతు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మానవత్వంతో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి అందరూ తరలివచ్చి తమ జీవిత కాలాన్ని పూర్తిఆరోగ్యవంతులుగా జీవించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాన్ని కామినేని హాస్పిటల్ అవోపా డాక్టర్ అసోసియేషన్ సౌజన్యంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు

Related posts

తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలనేదే కేసీఆర్ లక్ష్యం

Satyam NEWS

నీట్, ఐఐటీ-జేఈఈ 2021 గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

Satyam NEWS

తెలుగు పబ్ @ కూచిపూడి వెంకట్ మారేడుమిల్లి

Satyam NEWS

Leave a Comment