28.7 C
Hyderabad
April 25, 2024 06: 54 AM
Slider జాతీయం

రానున్న రెండు వారాలు అత్యంత కీలక సమయం

rajeev gowba

కరోనా వైరస్ మహమ్మారిని జయించేందుకు రానున్న రెండు వారాలు అత్యంత కీలకమని, అన్ని రాష్ట్రాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు.

కోవిద్-19 కేసులు అధికంగా నమోదు అవుతున్న జిల్లాల కలెక్టర్లు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆదివారం ఆయన ఢిల్లీ నుండి వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ లాక్ డౌన్ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు పనిచేసేలా చూడాలని సిఎస్ లకు సూచించారు.

ఆహారం, మందులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. లాక్ డౌన్,కంటైన్మెంట్ విధానాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించేలా చూడాలని చెప్పారు.

లాక్ డౌన్ ఆనేది మనకు లభించిన అద్భుత అవకాశమని దీనిని కట్టుదిట్టం గా అమలు చేయడం ద్వారా కరోనా మహమ్మారిని దేశం నుండి తరిమి గొడదామని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాల్లో ర్యాఫిడ్ రెస్పాన్స్ బృందాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని సిఎస్ లను, కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్రాలు, జిల్లాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని వనరులను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని అవసరమైన సమయంలో అవసరమైన ప్రాంతాల్లో సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు. హైరిస్క్ ఉన్నవారంతా విధిగా క్వారంటైన్ కేంద్రాలు లేదా ఐసోలేషన్లోను ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాజీవ్ గౌబ స్పష్టం చేశారు.

Related posts

సౌమ్యనాధ బ్రహ్మోత్సవాలల్లో ధ్వజారోహణం

Satyam NEWS

ఫ్రాన్స్ తో ఎయిర్ ఇండియా భాగస్వామ్యం

Satyam NEWS

ఎట్టకేలకు పట్టుబడ్డ చిరుత పులి

Satyam NEWS

Leave a Comment