31.2 C
Hyderabad
April 19, 2024 05: 10 AM
Slider హైదరాబాద్

ఫాసిజంకు వ్యతిరేకంగా లౌకిక వాద పరిరక్షణకై విశాల ఉద్యమం

#cpi

భారతదేశంలో అత్యంత ప్రమాదకరంగా పరిణామం చెందుతున్న మతోన్మాద ఫాసిజం, లౌకికవాదం పరిరక్షణకై వామపక్ష, దళిత బహుజన ప్రజాతంత్ర శక్తులతో దేశంలో విశాలమైన ఐక్యవేదిక నిర్మించి ప్రజా పోరాటాలు ఉదృతం గా కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. బాలమల్లేష్ పేర్కొన్నారు.

ఆదివారం సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగిన భారత్ బచావ్ మేదో మదన సదస్సులో ఎన్. బాలమల్లేష్ పాల్గొని ప్రసంగించారు. ఆయన తన ప్రసంగము కొనసాగిస్తూ భారతదేశంలో ఇప్పటికీ ప్రమాదకరంగా చలామణి అవుతున్న మనువాద కుల క్రూరత్వానికి తోడుగా దేశంలో రాకెట్ వేగంతో వస్తున్న ఫాసిజం ప్రజల కనీస హక్కులను కాల రాయబోతున్నదని, పాసిజానికి బహుముకాలు ఉంటాయనే చారిత్రక సత్యాన్ని గుర్తించాలని అన్నారు. 2014లో బిజెపి మోడీ నాయకత్వంలో ఫాసిజం, లౌకిక వ్యవస్థలను చిన్నబిన్నం చేశారని విమర్శించారు.

ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల అధిపతులైన అదాని, అంబానీలకు కారు చౌక అమ్మేసి, కార్మికుల ఉపాధికి గండి కొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం 8 సంవత్సరాలు కావస్తున్న ఉపాధి ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. భారతదేశంలో అపారమైన సంపదను మోడీ కొల్లగొట్టి వారి మిత్రులైన కార్పొరేట్ వ్యక్తులకు కూడగడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

నేడు దేశంలో ఫాసిజం అప్రకటిత ఎమర్జెన్సీ రూపంలో కొనసాగుతుందని అన్నారు. ప్రమాదకరమైన ఫాసిస్టు, మతోన్మాద శక్తులను ఎదుర్కోవడానికి తమ తమ అస్తిత్వాలను కాపాడు వామపక్ష, బహుజన, దళిత, ప్రజాతంత్ర శక్తులతో కలిసి దేశంలో విశాల ఐక్య సంఘటన ద్వారా ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగించాలని ఎన్. బాలమల్లేష్ పేర్కొన్నారు. ఈ సదస్సులో కేంద్ర మాజీ మంత్రి భక్త చరణ్ దాస్, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు డాక్టర్ సీతక్క, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం, అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క తదితరులు పాల్గొన్నారు.

Related posts

సూసైడ్ నోట్: భార్యకు మరో వివాహం చేసి సంతోషంగా

Satyam NEWS

శారదా విద్యాలయ శతాబ్ది వేడుకలు ప్రారంభం

Satyam NEWS

Assurance: నాయీ బ్రాహ్మణులకు అండగా ఉంటాం

Satyam NEWS

Leave a Comment