38.2 C
Hyderabad
April 25, 2024 12: 53 PM
Slider ఖమ్మం

వ్యవసాయ బిల్లు పై కదం తొక్కిన వామపక్షాలు

#CPIKhammam

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తూ రైతు జీవితాలను కార్పొరేట్‌కు పణంగా పెట్టేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఎండగడుతూ వామపక్షాలు శుక్రవారం ఖమ్మంలో కదం తొక్కాయి.

ఖమ్మం రూరల్‌ మండం నాయుడుపేట జంక్షన్‌లోని రాంలీ ఫంక్షన్‌ హాల్‌ నుంచి గోపాపురం వద్ద ఉన్న శ్రీశ్రీ విగ్రహం వరకు భారీ ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీ నిర్వహించాయి.

రైతుకు నష్టం చేసే వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంత్‌రావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, సీపీఐ(ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు రాయ చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

భూమికి చెర… రైతుకు ఉరి

భూమికి చెర… రైతుకు ఉరి లాంటి ఈ బిల్లును కేంద్రం తక్షణం ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ బిల్లు ఆమోదం కోసం సభలో బీజేపీ వ్యవహరించిన తీరును ఆక్షేపించారు.

ఓటింగ్‌ అడిగిన సభ్యుల హక్కును కాలరాసి ముజువాణి ఓటుతో పార్లమెంటరీ నిబంధనకు విరుద్ధంగా మోడీ సర్కారు ఆమోదింపజేసిందని మండిపడ్డారు.

21వ శతాబ్దపు అవసరం కోసం ఈ బిల్లు అని మోడీ అంటున్నారు.. వాస్తవానికి ఇది కరోనా సమయంలో కార్పొరేట్ల కోసం తెచ్చిన బిల్లు అని మండిపడ్డారు. రైతును కూలీలుగా.. కార్పొరేట్‌ కంపెనీకు కట్టుబానిసుగా మార్చేందుకే ఈ బిల్లు అన్నారు. ఈ బిల్లు మూలంగా వ్యవసాయ మార్కెట్లు పూర్తిగా రద్దవుతాయన్నారు.

స్వేచ్ఛా మార్కెట్‌ పేరుతో కార్పొరేట్‌కు ధారాదత్తం చేసేందుకు కుట్రపన్నుతున్నారన్నారు. మార్కెట్లో నిత్యావసర వస్తువు, పంట కొరతను సృష్టించి రైతును నట్టేట ముంచే బిల్లు ఇవి అని మండిపడ్డారు.

దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేబిల్లులు

దేశాన్ని అత్యంత ప్రమాదంలోకి నెట్టే ఈ బిల్లు ను తక్షణం ఉపసంహరించుకోవాని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును రాష్ట్రపతి వెనక్కు పంపాని కోరారు.

కరోనా సమయంలో ప్రజను మరింత సంక్షోభంలోకి నెట్టేందుకు బీజేపీ సర్కారు చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం విద్యుత్‌ బిల్లు, జీఎస్టీ, వ్యవసాయ బిల్లు ఇలా ఒకదాని వెంట ఒకటి ప్రవేశపెడుతూ దేశాన్ని అత్యంత ప్రమాదకర స్థితిలోకి నెడుతోందన్నారు.

రైతుకు తీరని నష్టం చేసే ఈ వ్యవసాయ బిల్లు కు వ్యతిరేకంగా ఓటేసిన టీఆర్‌ఎస్‌ను అభినందించారు. బిల్లు కు వ్యతిరేకంగా వామపక్షాలు చేస్తున్న పోరాటాల్లో టీఆర్‌ఎస్‌ కలిసిరావాని పిలుపునిచ్చారు.

ఈ ర్యాలీ, బహిరంగసభలో  సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, కళ్యాణం వెంకటేశ్వరరావు,  రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్‌, జిల్లా కమిటి సభ్యులు యర్రా శ్రీను, బండి పద్మ, వై. విక్రమ్‌, తుశాకు లింగయ్య,

ఎం.ఏ.జబ్బార్‌, బండారు రమేష్‌, తుమ్మ విష్ణువర్ధన్‌, తుమ్మ శ్రీనివాస్‌, మండ కార్యదర్శు డి.తిరుపతిరావు, ఎస్‌కె.మీరా, ఎస్‌.నవీన్‌రెడ్డి, ప్రజా సంఘా నాయకులు ఎస్‌కె.బషీర్‌, మేక నాగేశ్వరరావు, ఎం.డి.గౌస్‌, సీపీఐ జిల్లా సీనియర్‌ నాయకులు మౌలాన,

జిల్లా నాయకు జానీమియా, తాటి వెంకటేశ్వర్లు, సలాం, కళావతి, సీపీఐ(ఎంఎల్‌) నాయకులు ఆవు వెంకటేశ్వర్లు, పుల్లయ్య, అశోక్‌, మలీదు నాగేశ్వరరావు, ప్రభావతి పాల్గొన్నారు.

Related posts

దారిపొడవునా చంద్రబాబుకు ఘన స్వాగతం

Satyam NEWS

ఘనంగా మహేశ్ బాబు సోదరి పుట్టిన రోజు

Satyam NEWS

ప్రతి ఒకరు కరోనా బూస్టర్ డోస్ తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment