37.2 C
Hyderabad
March 28, 2024 18: 20 PM
Slider రంగారెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది

#GHMC

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్నవారు ఎవరూ కూడా అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందజేస్తుందని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు అన్నారు.

ఆయన నేడు జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్ మమత, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, కార్పొరేటర్ యం లక్ష్మీబాయి లతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజవన్ లోని వెంకటేశ్వర నగర్, రిక్షాపుల్లర్స్  కాలనీలో వర్ష బాధితులకు చెక్కులు అందచేశారు.

స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ ఆదేశాలు మేరకు  బాధిత కుటుంబాలకు పదివేల  రూపాయల ఆర్థిక సహాయాన్ని అందచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి గొట్టిముక్కుల పెద్ద బాస్కర్ రావు, నాయినేని చంద్రకాంత్ రావు, యం. రామారావు తదితరులు ఉన్నారు.

ఈ సందర్బంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ అన్ని వేళల సహాయక చర్యలు చేయడానికి టి.ఆర్.ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు.

వరద బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు  తక్షణ  సహాయంగా సీఎం కేసీఆర్ రూ.550 కోట్లు కేటాయించడం సంతోషకరమని అన్నారు.

వరద వల్ల ఇంట్లోకి నీళ్లు రావడం ఆస్తి నష్టం జరగడం ఇల్లు కోల్పోయిన వారికి అధికంగా సహాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో  జీహెచ్ఎంసి, రెవెన్యూ  అధికారులతో పాటు డివిజన్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, వార్డు మెంబర్స్, ఏరియా కమిటీ మెంబర్స్, స్థానిక పెద్దలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.   

Related posts

హుజుర్ నగర్ లో ఘనంగా మదర్ థెరిస్సా జయంతి

Satyam NEWS

మెడికల్ అండ్ హెల్త్ జెఏసీ క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

క్రైమ్ స్టోరీ: మందు పోయిస్తావా చంపమంటావా?

Satyam NEWS

Leave a Comment