ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాత ఇండ్లు, గుడిసెలు, మట్టి మిద్దెలు కూలి పడుతున్నాయి. కొన్ని ఇండ్లు పోట్టుకు పెడుతున్నాయి. మొత్తానికి దీనివల్ల పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని 11వ వార్డు, ఇందిరా కాలనీలో కొన్ని ఇండ్లు వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీనితో ఇల్లు పెచ్చులు రాలి పడుతున్నాయి. ఇల్లు పోట్టుకు పెడుతుందని కొల్లాపూర్ తహశీల్దార్ కు ఇంటి యజమాని అవుట రాజశేఖర్ సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సకలంలో తహశీల్దార్ లేకపోవడంతో ఆర్ఐ గోవింద్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. కొన్ని రోజుల క్రితం ఇంటిని మున్సిపల్ చైర్ పర్సన్ పరిశీలించారు.
previous post