32.2 C
Hyderabad
April 20, 2024 19: 52 PM
Slider మహబూబ్ నగర్

భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి

#VijayakumarReddy

కల్వకుర్తి డిండి నార్లాపూర్ ప్రాజెక్ట్ లలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కాయతి విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2013 చట్టప్రకారం నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పి 2018 చట్టప్రకారం నామమాత్రపు డబ్బులు ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. రిజిస్ట్రేషన్ల విలువలను ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విలువలను పెంచకుండా రైతులకు అన్యాయం చేసిందన్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున నడుస్తున్న తరుణంలో ఎకరాకు 50 60 లక్షలు ధర పలుకుతుంటే ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన రైతులకు 5.లక్షల 50 వేలు ఇస్తామని చెప్పడం దారుణమన్నారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన రైతులకు 15 లక్షల నష్టపరిహారం చెల్లించి కల్వకుర్తి డిండి నార్లాపూర్ ప్రాజెక్టులలో రైతులకు 5,లక్షల 50 వేలు ఇస్తామనడం దారుణమన్నారు.

రైతులను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వనికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కల్వకుర్తి వంగూర్ వెల్దండ చారకొండ మండలాలలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Related posts

వ‌ర‌ద స‌హాయంపై బుర‌ద రాజ‌కీయాలు

Sub Editor

నా విజయం మహిళ సాధికారిత నూతన శకానికి నాంది

Bhavani

GO 317 : తొమ్మిదికి పెరిగిన ఉపాధ్యాయుల ఆత్మహత్యలు

Satyam NEWS

Leave a Comment