37.2 C
Hyderabad
March 29, 2024 20: 20 PM
Slider విజయనగరం

కరోనా తో మృతి చెందిన వారి పిల్లలకు పరిహారం

#vijayanagaram col

విజయనగరం జిల్లాలో కరోనా తో కన్నవారు మృతి చెంది, అనాధలుగా మిగిలిపోయిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన  ఎక్ష గ్రేషియో  ను జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తన ఛాంబర్ లో పిల్లల సంరక్షకులకు  అందజేశారు. 

జిల్లాలో ముగ్గురు బాలలకు ఒక్కొక్కరికి 10 లక్షల  రూపాయల చొప్పున 30  లక్షల  బాండ్ లను అందజేశారు.   కొత్తవలస  మండలం చింతలదిమ్మ గ్రామానికి చెందిన కానూరు సూర్యనారాయణ కరోనా తో 2021 మే నెల 26 న మృతి చెందగా ఆయన భార్య జయలక్ష్మి 2011 లో గుండె సమస్య తో మృతి చెందారు. 

వారి పిల్లలు కానూరు  మేఘమాల, కానూరు రాకేశ్ కు10 లక్షల  చొప్పున  బాండ్లను పిల్లల సరక్షకులు వారి  తాతయ్య కు అందజేశారు.  అదే విధంగా మక్కువ మండలం మక్కువ గ్రామానికి చెందిన  మహాపాత్రుని నరసింహ మూర్తి , దేవి దంపతులు  కరోనా తో మరణించగా వారి కుమార్తె మహాపత్రుని పద్మజ రాణి కు 10 లక్షల  రూపాయల  బాండ్ ను  తన  సంరక్షకుడైన మేన మామ  కు అందజేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి  మాట్లాడుతూ  పిల్లలు బాగా చదువుకోవాలని, క్రమ శిక్షణ తో  పెరగాలని  పిల్లలను ఆశీర్వదించారు. పౌష్టి కాహారాన్ని అందించి, మంచి చదువు చదివించాలని వారి సంరక్షకులకు చెప్పారు.  వీరి  మంచి చెడ్డలను పర్యవేక్షించాలని. ఐ.సీ.డీ.ఎస్. పి.డి రాజేశ్వరికి సూచించారు.  ఏ అవసరమైన తనను కాంటాక్ట్ చేయవచ్చని పిల్లలకు  భరోసా ఇచ్చారు.

Related posts

తెలంగాణ పర్మిషన్ మేమెందుకు తీసుకోవాలి?

Satyam NEWS

అరుణాచ‌ల్‌ ప్రదేశ్‌లో 100 ఇళ్లు నిర్మించుకున్న చైనా

Sub Editor

గుడ్డి గుర్రాలు ఇకనైనా కళ్ళు తెరవాలి

Satyam NEWS

Leave a Comment