34.2 C
Hyderabad
April 19, 2024 21: 07 PM
Slider ప్రత్యేకం

పోలీస్ స్పంద‌న‌కు త‌గ్గుతున్న ఫిర్యాదు దారులు….!

#deepikaips

స‌త్యం న్యూస్.నెట్ ప‌రిశోధానాత్మ‌క క‌థ‌నం ఏం చెబుతోంది..?

మీ ఇంట్లో స‌మ‌స్య‌లున్నాయా.? అదే మీ కుటుంబంలోనిగాని…మీ బంధువుల‌తో గాని..లేక‌పోతే…మీ చుట్టు ప‌క్క‌ల‌వారితో గాని అదీ గాక‌పోతే….బ‌య‌ట‌న గాని ఏ ర‌క‌మైన స‌మ‌స్య‌ను గాని ఎదుర్కొంటున్నారా…? అయితే  త‌క్ష‌ణం… పోలీస్ శాఖ నిర్వ‌హిస్తున్న స్పంద‌న‌న కార్య‌క్ర‌మానికి వెళ్లండి..ఏంటీ మా కుటుంబ స‌మ‌స్య‌ల‌ను పోలీసు లు ప‌ర‌ష్క‌రిస్తారా..? అని నోరెళ్ల‌బెట్ట‌కండి… !

ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం…అటు పోలీస్ శాఖ,ఇటు రెవిన్యూ శాఖ ద్వారా  సామాన్యులు ప‌డుతున్న‌,ఎదుర్కొంటున్న క‌ష్టాల‌ను… అందుకు చ‌ట్టాలు…క‌ల్పిస్తున్న వెసులుబాటు,సౌక‌ర్యాలను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని..వారి వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ వ‌స్తోంది..అందుకు ఉదాహ‌ర‌ణే  రెవిన్యూ  శాఖ ద్వారా గ్రీవెన్స్…పోలీస్ శాఖ ద్వారా స్పంద‌న కార్యక్ర‌మం. ప్ర‌స్తుత ఈ సమాజంలో..భూ అంటే రెవిన్యూ…ఇటు  కుటుంబ స‌మ‌స్య‌లే ప్ర‌తీ ఒక్కరినీ  ప‌ట్టి  పీడిస్తున్నాయి.

దీనికి తోడు…ఆయా శాఖ‌ల‌లో సిబ్బంది  వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకూడా  బాధితుల‌ను స్పంద‌న మెట్లు ఎక్కిస్తున్నాయి. అయితే  పోలీస్ శాఖ‌లో ప్ర‌తీ వారం జ‌రుగుతున్న‌స్పంద‌న తీరు చూస్తే…త‌ద్వారా బాధితులల‌లో కాస్త  ధైర్యం..హ‌మ్మ‌య్య‌…పోలీస్ బాస్ కు చెప్పాము…త‌మ స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌న్న భ‌రోసా క‌ల్పిస్తున్నారు…విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ దీపిక‌. 

ఎస్పీగా దీపిక ఎం పాటిల్ జిల్లా కు వ‌చ్చి దాదాపు..11  నెల‌లు కావ‌స్తోంది…నెల‌కు  నాలుగు చొప్పున‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌మార‌మి 44 స్పంద‌న కార్యక్ర‌మాల ద్వారా బాధితుల నుంచీ ఫిర్యాదు రూపంలో స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్న ఎస్పీ దీపిక …అక్క‌డక్క‌డే ఆయా స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ల‌తో మాట్లాడి..వాటిప‌రిష్కారం కొర‌కు చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు…వాటి ఫలితాన్ని కూడా తెలుకుంటున్నారు..పోలీస్ బాస్. 

గ‌డ‌చిన మూడు స్పంద‌న కార్య‌క్ర‌మాల‌ను ఒక్కసారి నిశితంగా ప‌రిశీలిస్తే…ఫిర్యాదు దారుల సంఖ్య త‌గ్గుతూ వస్తోంది.ఇదే విష‌యాన్ని వార్తావ‌ళి ప్ర‌తినిది  ఎస్పీని అడిగితే…ఒక ర‌కంగా జిల్లా ప్రజ‌లు స‌మ‌స్య‌లు లేకుండా  వారి వారి జీవితాలు సాపీగా సాగుతున్నాయ‌నే చెప్పాల‌ని చెప్పారు.

ఏదైనా మ‌రి కొద్ది రోజుల్లో ఎస్పీగా త‌న చార్జ్ తీసుకుని ఏడాది పూర్త‌వుతున్న సంద‌ర్బంగా…జిల్లా ఎస్పీ దీపిక‌…మ‌రీ ముఖ్యంగా శాఖా సిబ్బందిని స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానంగా దృష్టి పెట్ట‌డంతో పాటు..స్పంద‌న‌కు వచ్చి ఫిర్యాదు చేయాల‌న్న ఆలోచ‌న‌ను ప్రజ‌ల‌లో త‌గ్గించారని అని అంటోంది….స‌త్యం న్యూస్.నెట్

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

విహార యాత్రలో రోడ్డు ప్రమాదం: విద్యార్ధులకు గాయాలు

Satyam NEWS

కరోనాపై మరింత సమర్ధంగా పోరాటం జరగాలి

Satyam NEWS

పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించే తొలి మెట్టు ట్రాఫిక్ పోలీసులే

Satyam NEWS

Leave a Comment