35.2 C
Hyderabad
April 20, 2024 17: 24 PM
Slider మహబూబ్ నగర్

అడ్డాకుల ఎస్సైపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

#HumanRightsCouncil

నిబంధనలకు విరుద్ధంగా సివిల్ మ్యాటర్ లో తలదూర్చడమే కాకుండా, ఫిర్యాదు చేసిన బాధితుల్ని పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించిన మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల ఎస్ఐ పై మానవ హక్కుల ఉల్లంఘన చట్టం కింద ఫిర్యాదు నమోదు అయింది.

ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ కోరారు. ఆయన అధ్వర్యంలో బాధితులు పి. హారతి ఆమె భర్త చంద్రశేఖర్ శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారని రాచాల గౌడ్ విలేకరులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శశికుమార్, అడ్డాకుల మండల కన్వీనర్ ఎస్ .కె ఆంజనేయులు సాగర్  పాల్గొన్నారని ఆయన చెప్పారు.

Related posts

అధికారులు పనితీరు పై ఎమ్మెల్యే కోలగట్ల అసహనం..!

Satyam NEWS

భాజపా సోషల్‌ మీడియా రాష్ట్ర బాధ్యుల నియామకం

Bhavani

రాష్ట్ర మంతటా వేదవ్యాసుని జయంతి వేడుకలు..!

Satyam NEWS

Leave a Comment