32.7 C
Hyderabad
March 29, 2024 12: 08 PM
తెలంగాణ

మోసాల ‘ముద్ర’ పై కేంద్రం దర్యాప్తు?

pjimage (1)

ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ముద్ర పథకంలోని పేరును దుర్వినియోగం చేస్తూ పేదలను దోచుకుంటున్న సంస్థపై స్థానిక బిజెపి నాయకులు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్న ఈ చర్యలను తక్షణమే చట్ట ప్రకారం అడ్డుకోవాలని బిజపి నాయకులు ఎల్లేని సుధాకర్ రావ్, కుమారి బంగారు శృతి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరుద్యోగుల నుంచి తీసుకున్న లక్షల డిపాజిట్ల తోనే  చిరువ్యాపారులకు, సామాన్యులకు డైలీ, వీక్లి ఫైనాన్స్ ఇస్తూ అధిక వడ్డీలు ఇస్తున్నారని ఈ ముద్రా సొసైటీ పై ఫిర్యాదులు ఉన్నాయి. అవినీతిని, మోసాలను సహించని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్  ఎల్లేని సుధాకర్ రావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి గా పోటీ చేసిన దళిత బిడ్డ బంగారు శృతి ఈ మోసాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ బోగస్ సొసైటీ తీసుకున్న డిపాజిట్లు వివరాలు ఇతర  పూర్తి ఆధారాలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈవిషయం తెలుసుకున్న ఆ బోగస్ సొసైటీకి చెందిన ఒక నాయకుడు ఉలిక్కి పడ్డాడు. తన అనుచర వర్గాన్ని పురపాలక ఎన్నికల్లో పోటీ చేయించడానికి సిద్ధమైన ఆయనకు ఇది షాక్ లా తగిలింది. దాంతో ముద్ర అగ్రికల్చర్ సొసైటీలో  వివిధ  బాధ్యతలతో  కొనసాగుతున్న  కో,వైస్ చైర్మన్లు, డైరెక్టర్స్  రాజీనామా  చేశారు. అయితే అప్పటికే ఫిర్యాదు అందడంతో వారు ఇప్పుడు తప్పించుకునే మార్గం లేదు. ఏది ఏమైనా  కేంద్ర హోం సహాయ శాఖ మంత్రికి ఫిర్యాదు అందిన తర్వాత రాజీనామాలు చేయడం ఒక డ్రామా గా అనిపిస్తుంది. ఇందులో ఒక దళితుడు ఆధారాలు లేకుండా అడ్డగోలుగా రాతలు రాసిన అగ్రవర్ణలకు బినామిగా ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడు అని తెలిసింది. ఇది మరో అగ్రిగోల్డ్ గా మారక ముందుకే సిబిఐ ఎంక్వైరి చేయించాలని ఫిర్యాదులో తెలిపారని తెలిసింది. సొసైటీలో ఎనిమిది మంది రాజీనామా చేసినట్లు అందులో ఒక వ్యక్తి తెలిపారు. ఇంకా వీరికి కొమ్ముకాసిన నాయకునిపై ప్రతి పక్ష పార్టీలు పురపాలక ఎన్నికల్లో ప్రచారంలో దుమ్మెత్తి పొసే ఆరోపణలు చేయడానికి ఈదొక్క ఆధారాలతో కూడిన అవకాశం.

Related posts

గోతికాడ నక్కల్లా ఉన్నారు ప్రతిపక్షాల వాళ్లు

Satyam NEWS

దేశ రాజధానిలో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్

Satyam NEWS

మే 23 నుండి పదవ తరగతి పరీక్షలు

Sub Editor 2

Leave a Comment