22.2 C
Hyderabad
December 10, 2024 11: 02 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి అవినీతి అధికారి పై  ఫిర్యాధు చేస్తాం

civil

వనపర్తి సివిల్ సప్లయి అవినీతి అధికారి ఇర్ఫాన్ పై  చర్యలు తీసుకోకుంటే సివిల్ సప్లయ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిర్యాధు చేస్తామని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హెచ్చరించారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డిఎం ఇర్ఫాన్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపి అతనిపై కఠిన చర్యలు చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇర్ఫాన్  పనిచేసిన ప్రతి చోట అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఆయన అవకతవకలపై ఇప్పటికే రెండు సార్లు సస్పెండ్ అయ్యారని, అయినా తీరు మార్చుకోకుండా  వనపర్తిలో అవినీతి జోరు కొనసాగిస్తున్నారన్నారు.

ఆయనను ప్రభుత్వం  ఇటీవలే బదిలీ చేసినా ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. కొత్త అధికారిని రానివ్వకుండా అవినీతి సొమ్ముతో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని ఆటలు ఆడుతున్నాడని మండిపడ్డారు. పనిచేసిన ప్రతీ చోటా  సస్పెన్షన్ లేకపోతే నోటీసులు అందుకున్న చరిత్ర ఇర్ఫాన్ కు ఉందని, ఇక్కడ మిల్లర్లతో కుమ్మక్కు అయ్యి.. బదిలీ అయినా వెళ్లకుండా నాటకాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కు ఈ తతంగం తెలియడం లేదా అని ప్రశ్నించారు.

అదిలాబాద్ జిల్లాలో గోదాం ఇంచార్జిగా ఉండి అవకతవకలు చేస్తే మొదటిసారి సస్పెండ్ చేశారని, వరంగల్ రూరల్ జిల్లాలో  మళ్ళీ అవినీతికి పాల్పడితే  రెండవసారి సస్పెండ్ చేశారన్నారు. కామారెడ్డిలో రైస్ మిల్ పెట్టి దాదాపు 40 ఎసికెల (4కోట్ల  రూపాయల) ధాన్యం  బంకర్ కింద దాచిపెడితే  విచారణ జరిపిన అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారని, ఈ విషయంలో  క్రిమినల్ కేసు కూడా నమోదు చేసినట్లు సమాచారం ఉందన్నారు.

అక్కడి నుండి వికారాబాద్ జిల్లాకు బదిలీ చేస్తే లాంగ్ లివ్ పెట్టి అక్కడ రిలీవ్ కాకుండానే నిబంధనలకు విరుద్ధంగా వనపర్తిలో  జాయిన్ అవ్వడమే కాకుండా విధులు నిర్వర్తిస్తూ జీతం తీసుకుంటున్నాడని  దీనిపై కూడా విచారణ జరుగుతుందన్నారు.  బియ్యాన్ని రీప్లేస్ చేయకుండా మిలర్లతో డబ్బులు తీసుకుని  వేరే జిల్లాకు పంపించడం  జరిగిందన్నారు. వనపర్తిలో అవినీతి అధికారులు ఉన్నారని, వారిపై పోరాటం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జెఎసి నాయకులు రాఘవేందర్ గౌడ్, మహిందర్ నాయుడు, శివ శంకర్, మ్యాదరి రాజు, నాగరాజు గౌడ్, రామన్ గౌడ్, రమేష్ ,సత్యన్న, అల్వాల కృష్ణయ్య, మధుసూదన్, రాజు, అశోక్, సత్తూర్ శ్రీనివాస్ గౌడ్  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

వివేక హత్య కేసులో వివరాల వెల్లడి క్రమశిక్షణ ఉల్లంఘనే

Satyam NEWS

ప్రొబేషన్ డిక్లరేషన్ మహిళా సంర‌క్ష‌ణ పోలీసులకు త్వరలో శిక్షణ

Satyam NEWS

బీభత్సం: అరగంట సేపు హడలెత్తించిన వర్షం…!

Satyam NEWS

Leave a Comment