ఐదు సంవత్సరాలలో వనపర్తి మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, ప్రస్తుతం జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, సభ్యులు కొత్త గొల్ల శంకర్, గౌని కాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, సూగురు రాజ్ కుమార్, శరత్ చంద్ర, వెంకటేష్ జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో కోరా రు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అర్హులైన అభ్యర్థులకు ఇవ్వాలని అనర్హులు ఉంటే తొలగించాలని కోరారు. అలాగే కౌన్సిల్ ముగిస్తున్న సమయంలో 25వ తేదీ రాత్రి వరకు సి. ఆర్. లపై సంతకాలు జరిగాయని వాటిలో ఏమైనా అక్రమాలు ఉంటే దర్యాప్తు చేయాలని కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్