29.2 C
Hyderabad
September 10, 2024 17: 10 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి మున్సిపాలిటీలో అంతులేని అవినీతి

#prajavani

వనపర్తి మున్సిపాలిటీలో జరుగుతున్న వివిధ అక్రమాలు, అవినీతిని గుర్తించి విచారణ చేయాలని అఖిలపక్షం ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ప్ర జావాణిలో వనపర్తి జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన పిర్యాదులో కోరారు. ప్రజలు కట్టిన పన్నులు జనరల్ ఫండ్ గా జామ చేస్తారని కానీ అలాంటి జనరల్ ఫండ్ త్రాగునీటి అవసరాలకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని కానీ వనపర్తి మున్సిపాలిలో జనరల్ ఫండ్ దారి మళ్ళుతుందని  ఫిర్యాదు చేశామని తెలిపారు.

మిషన్ భగీరథ నీరు సరఫరా చేసే ఆర్ డబ్ల్యూఎస్ లో మున్సిపల్ సిబ్బంది పనిచేయడం,  ప్రజా ప్రతినిధులు కమీషనర్ ఇళ్లల్లో మున్సిపల్ సిబ్బందిని వాడుకోవడం చట్టవిరుద్దమని తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ కు సంబంధించిన ఇద్దరికీ 10 లక్షలు మున్సిపాలిటీ నుండి కేటాయించడం చట్ట ప్రకారం సరైనదా అని ప్రశ్నించారు. రామనుపాడు  నుండి వనపర్తికి ప్రతిరోజూ నీరు సరఫరా అవుతున్నా ట్యాంకర్ల పేరుతో లక్షలు బిల్లులు చేసుకుంటున్నారని వివరించారు. లీకేజీల పేరుతో 15 ఫైనాన్స్ నుండి లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి సామాను తెప్పించి అవి ఉండగానే మళ్లీ చీటీల పేరుతో పలు షాపుల్లో సామాను తెప్పించుకుంటున్నారని తెలిపారు.

ప్రతిరోజు నీరు వస్తున్నా బోర్ల రిపేరు, మోటర్లు పేరుతో లక్షల  బిల్లులు చేసుకోవడం, ఆర్. డబ్ల్యూ ఎస్ వారు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా చేస్తున్నా మున్సిపాలిటీ నుండి అధిక మొత్తంలో బిల్లులు పెట్టడం వెనక అవినీతి ఉందన్నారు.  విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తో పాటు టిడిపి రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్, తీన్మార్ మల్లన్న సంఘం జిల్లా ప్రెసిడెంట్ విజయ్ యాదవ్, బీ.జే.వై.ఎం టౌన్ ప్రెసిడెంట్ రవి, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్, బీసీ సంఘం నాయకులు గౌనికాడి యాదయ్య, నాయకులు బోడ్డుపల్లి సతీష్, జగన్  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ఏప్రిల్ 10వ తేదీ నుండి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

అభివృద్ధి పనుల్లో నాణ్యత కలిగిన ప్రమాణాల పట్టించాలి

Satyam NEWS

ప్రజాసేవలో నిమగ్నమైన వారే కమ్యూనిష్టులు

Satyam NEWS

Leave a Comment