క్రైస్తవ మతమార్పిడి మాఫియా కేంద్రాలుగా మారిన తెలంగాణా ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి డా. రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. తెలంగాణా రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల కేంద్రంగా నడుస్తున్న క్రైస్తవ మతమార్పిడి మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు TGRJC సెక్రెటరీ CH. రమణ కుమార్ ని కలిసి ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
హనుమకొండ జిల్లా పరిధిలోని హాసన్ పర్తి కళాశాలలో ఫ్రిన్సిపల్ ఇందుమతి మతమార్పిడి మాఫియాను కొనసాగిస్తున్నారని, విద్యార్థినులను వేధింపులకు మరియు ప్రలోభాలకు గురిచేసి మతం మారుస్తుందని, బాలికల రెసిడెన్షియల్ కళాశాలలోకి బయటి నుండి క్రైస్తవ ఫాదర్ లను రప్పించి మతమార్పిడి జరిపిస్తున్నారని, 21 సంవత్సరాలుగా ఒకే దగ్గర తిష్ఠవేసిన ఫ్రిన్సిపల్ ఇందుమతి వ్యవస్థలన్నింటిని తనకు అనుకూలంగా మలచుకొని హసన్ పర్తి బాలికల రెసిడిన్షియల్ కళాశాలను చర్చిగా మార్చిందని ఆయన అన్నారు.
మతం మారడానికి ఇష్టపడని విద్యార్థినులపై జరుగుతున్న వేధింపులు బరించలేక అనేకమంది విద్యార్థినులు తమ చదువులు మధ్యలోనే వదులుకుంటున్నారని, ఫ్రిన్సిపల్ భౌతిక వేధింపుల కారణంగా విద్యార్థినులు తీవ్ర భయంలో ఉన్నారని కార్యదర్శి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది, పై విషయాలకు సంబందించిన వీడియోలు మరియు ఫోటోల సాక్ష్యాలను సెక్రటరి గారికి సమర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి TGRJC కేంద్రంగా సాగుతున్న మతమార్పిడులు అరికట్టాలని, ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో విఫలమైతే VHP ప్రత్యక్ష కార్యచరణకు సిద్దమవుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది.