23.8 C
Hyderabad
September 21, 2021 22: 08 PM
Slider మహబూబ్ నగర్

దళితులను అవమానించిన కొల్లాపూర్ ఎస్ ఐ పై డీజీపీకి ఫిర్యాదు

#telanganadgp

తెలంగాణ దళిత దండు రాష్ట్ర అధ్యక్షుడు  బచ్చలకూర బాలరాజు ను కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎస్ ఐ జి.బాల వెంకట రమణపై దళిత ప్రజాసంఘాల నాయకులు డిజిపికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డిని నేడు కలిసిన దళిత ప్రజాసంఘాల నాయకులు ఎస్ఐ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని కోరారు.

కొల్లాపూర్ ఎస్ ఐ చట్టాలను ఉల్లంఘిస్తూ దళితులపై దాడులు చేస్తున్నారని డిజిపికి ఫిర్యాదు చేశారు. దళితుడని కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడుతూ దాడి చేసిన కొల్లాపూర్ ఎస్ఐ జి. బాల వెంకట రమణ పై చర్యలు తీసుకోవాలని  తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డిని దళిత ప్రజాసంఘాల నాయకులు కోరారు.

మంగళవారం హైదరాబాద్ లో డిజిపి మహేందర్ రెడ్డిని   తెలంగాణ మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాందాస్, కొల్లాపూర్ ఇంచార్జీ అవుట శ్రీనివాసులు, ఓయు జెఏసి బిఎస్ఎఫ్ అధ్యక్షుడు బోరెళ్లి సురేష్, దళిత దండు ఉపాధ్యక్షులు మొగులయ్య, మీసాల మహేష్,రాజారాం ప్రకాష్ ,కలమురి మధు  కలిశారు. గత గురువారం దళిత నాయకుడు బచ్చలకూర బాలరాజు ఫిర్యాదుదారుని వెంట వెళితే కొల్లాపూర్  ఎస్ఐ జి.బాల వెంకటరమణ  అసభ్యంగా మాట్లాడి దాడి చేసిన అంశాన్ని డిజిపికి తెలియజేశారు.

ఎస్ఐ జి. బాల వెంకటరమణ చట్టాలను ఉల్లంఘిస్తూ దళితుల పై అక్రమ కేసులు పెడుతూ దాడి చేస్తున్నారని బాధితుడు తెలంగాణ దళిత రాష్ట్ర అధ్యక్షుడు బచ్చల కూర బాలరాజు తో కలిసి పిర్యాదు చేశారు. ఎస్ఐ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని,అదే విధంగా అతని ఉద్యోగం నుంచి తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకుంటామని డిజిపి హామీ ఇచ్చారని వారు తెలిపారు.

Related posts

సౌదీ అరేబియాలో ఇంటి నుంచే ఈద్ కార్యక్రమం

Satyam NEWS

పండగ పూట జీతం లేని సమగ్ర శిక్ష సిబ్బంది

Satyam NEWS

సోషల్ మీడియా షేరింగ్ పై అరెస్టు చేసిన వ్యక్తి మృతి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!