28.7 C
Hyderabad
April 25, 2024 03: 26 AM
Slider మహబూబ్ నగర్

భార్యల పదవి మాటున దౌర్జన్యాలు చేస్తున్న భర్తలు

kollapur complaint 1

కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల భర్తల ధాటికి తాము తట్టుకోలేకపోతున్నామని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. తమను భయబ్రాంతులకు గురి చేస్తూ ప్రజాప్రతినిధులమైన మాపైనే దాడులు చేస్తున్నారని వారు అంటున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గెలిచిన మహిళలు తమ పోస్టులను నిర్వర్తించాలి తప్ప వారి భర్తలు వచ్చి అధికారం చెలాయిస్తామంటే చూస్తూ ఊరుకోమని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా బహిరంగ సభలో తెలిపినా కొల్లాపూర్ లో మాత్రం భర్తలదే రాజ్యం నడుస్తున్నదని వారు అంటున్నారు.

కొల్లాపూర్ మున్సిపాలిటీలో మంత్రి చెప్పిన దానికి విరుద్ధంగా చైర్మన్ వైస్ చైర్మన్ భర్తలు వారికి సంబంధం లేని వార్డులలో కలియతిరుగుతూ ఎవరైనా సరే మమ్మల్ని ఏమి చేయలేరు అని చెబుతూ ప్రజలను కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

కొల్లాపూర్ 6 వార్డు కౌన్సిలర్ పై వైస్ చైర్మన్ భర్త దురుసుగా ప్రవర్తించాడని వారు అంటున్నారు. మహిళా ప్రతినిధి అని కూడా చూడకుండా ఆమెపై వైస్ చైర్మన్ భర్త, అతని అనుచరులు దురుసుగా ప్రవర్తించడం శోచనీయమని అంటున్నారు.

గత వారం పది రోజుల నుంచి నీటి సమస్య ఉంటే దానిని పరిష్కరించేందుకు నేడు 9వ వార్డులో కౌన్సిలర్ నయీమ్  మిషన్ భగీరథ వారిని పిలిపించి పనులు చేయింస్తుంటే వైస్ చైర్మన్ భర్త అక్కడికి వచ్చి ఎవడ్రా ఇక్కడ పనులు చేసేది నాకు తెలియకుండా ఈ విధంగా పనులు చేస్తాడా అంటూ నానా దుర్భాషలాడుతూ బూతు పురాణం మొదలు పెట్టాడు.

 అక్కడ ఉన్న వార్డు సభ్యుడు అన్వర్ భాష వెళ్లి సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తే నీవు ఎవడివిరా అంటూ నేను ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిని నేను ఏమైనా చేస్తాను నన్ను నువ్వు ప్రశ్నిస్తారా అని  వారిపై దాడి చేసి కొట్టాడని అంటున్నారు. వైస్ చైర్మన్ భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఇతని వల్ల ఇతని వల్ల ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు హనుమంతు నాయక్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు రహీం బాలస్వామి, మహేష్ వెంకటేష్ కిరణ్  వేణు నాగరాజు సత్యం శేఖర్  సాయిలు  ఆరిఫ్ నజీర్ బాబా కర్ణ శివ రామ దాసు నరసింహ  ఖయ్యుం వార్డు సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు.

Related posts

ఈ చెత్త రోడ్లకు మరమ్మతులు చేపట్టండి మహాప్రభో

Satyam NEWS

కేసీఆర్ పై నేనే పోటీ చేస్తా: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Satyam NEWS

బయట నుంచి వచ్చిన వారికి స్వీయ నిర్భందం తప్పని సరి

Satyam NEWS

Leave a Comment