వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్ఐపై డిజిపికి పిర్యాదు చేశామని తెలంగాణ బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. పెబ్బేరులో గోదాములో గొనె సంచులు కాలినా చర్యలు లేవని, ఇసుక, రేషన్ బియ్యం మాఫియాతో కుమ్మక్కయ్యారని, అక్రమాలు చేశారని, ఎస్ఐని ఉద్యోగం నుండి తొలగించాలని కోరారు.ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని అయన అన్నారు. ఎస్ఐ అరాచకం, అక్రమాల గురించి తెలిసినా జిల్లా ఎస్పీ, ఐజి పట్టించుకోవడం లేదని అయన చెప్పారు. పెబ్బేరు ఎస్ఐని డ్యూటీ నుండి తప్పించి విచారణ చేయాలని అయన కోరారు. ప్రశ్నించిన వారిని ఇబ్బందులు పెడుతున్నారని అయన తెలిపారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్