39.2 C
Hyderabad
March 29, 2024 14: 31 PM
Slider మహబూబ్ నగర్

పెద్దమందడి పోలీసులపై హైకోర్టుకు ఫిర్యాదు

#highcourt

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామానికి చెందిన వ్యక్తి వాట్సప్ లో వీడియో పెట్టినందుకు అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులపై హైకోర్టుకు,మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని పెద్దమందడి మండల పరిషత్ అధ్యక్షుడు మేఘారెడ్డి చెప్పారు. వీడియో పోస్ట్ చేసిన వారిని అరెస్టు, రిమాండ్ చేయాలని, జైలుకు పంపాలని చట్టంలో లేదని,7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే కేసుల్లో అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందని ఆయన తెలిపారు. కానీ పోలీసులు మాత్రం శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని,ఇంకా నేరం చేసే అవకాశం ఉందని,కుట్రతో సాక్షులను ప్రభావితం చేస్తారని రిమాండ్ రిపోర్టులో తెలిపి అరెస్టు చేసినట్లు వివరించి కోర్టులో హాజరు పరుస్తారని ఆయన అన్నారు. వనపర్తి జిల్లాలో చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

నిర్లక్షపు కోరల్లో కామారెడ్డి జిల్లా ఆస్పత్రి

Satyam NEWS

యమ డేంజర్:నిర్మల్ లో డిటోనేటర్ పేలుడు

Satyam NEWS

Can Hemp Flower Cbd Make You Fail A Drug Test

Bhavani

Leave a Comment