మహాజన్ ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు, వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఐఎఎస్ స్మితా సబర్వాల్ పై వనపర్తి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి పిర్యాదు ఇచ్చారు. అనంతరం ప్రభాకర్ శెట్టి, వి హెచ్ పి ఎస్ ఎస్ వనపర్తి జిల్లా కన్వీనర్, గంధం గట్టయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ అనుబంధం సంఘాల సమన్వయకర్త పాల్గొని మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ను విధులనుండి వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వికలాంగులను అవమాన పరిచిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను డిస్మిస్ చెయ్యాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మంద కృష్ణ మాదిగ నాయకత్వములో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. వికలాంగులుగా పుట్టడమే పాపమా అని ప్రశ్నించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ వికలాంగులు కూడా సకలాంగులతో సమానంగా బ్రతకాలని రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు చేస్తుంటే ఓర్చుకోలేని ఐఏఎస్ అధికారిగా పదవిలో కొనసాగే నైతిక విలువలను కోల్పోయారని చెప్పారు.
ఒకవేళ వికలాంగులకు రిజర్వేషన్ లు లేకుంటే కనీసం మనిషిగా కూడా చూసేవారు కాదన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, కృష్ణయ్య, గంధం లక్ష్మయ్య, వి హెచ్ పి ఎస్ నాయకులు, శివ నాయక్, బంజారా గిరిజన సమితి రాష్ట్ర నేత పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్.నెట్