35.2 C
Hyderabad
April 24, 2024 14: 29 PM
Slider ప్రత్యేకం

డబుల్ బెడ్ రూమ్ లో అక్రమాలు చేస్తున్న సర్పంచ్

#nirmal

నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్ పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరిట లబ్ధిదారుల వద్ద భూమి కొనుగోలుకు డబ్బులు తీసుకొని తీరా ఇండ్లు నిర్మించిన తర్వాత అర్హులకు ఇళ్ల ఇవ్వ లేదని  ఆందోళన చేసిన సంఘటన నిర్మల్ జిల్లా సోన్ మండల్ కూచన పల్లి గ్రామంలో తాజాగా వెలుగులోకి వచ్చింది..

2018 సంవత్సరంలో అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి కూచన పల్లి గ్రామ సర్పంచ్ బండి లింగన్న తమ గ్రామంలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలని ని దరఖాస్తు ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టి 54 మంది అర్హులైన నిరుపేదలను గుర్తించారు గుర్తించారు.. గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడానికి ప్రభుత్వ భూమి లేకపోవడంతో సర్పంచ్  అర్హులైన లబ్ధిదారుల తో మాట్లాడి ఒక్కొక్కరి వద్ద 20 నుండి 30 వేలు తీసుకుని ఊరి  శివారులో భూమిని కొనుగోలు చేశారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో నిర్మాణం పూర్తి చేసుకున్న 30 ఇళ్లలో  ఇంతకు(గతంలో) ముందు ఎంపిక చేసిన జిల్లా సర్పంచ్ రాజు పాత లిస్టు లో 8 మంది పేర్లను తొలగించాడు,  అన్ని విధాలుగా ఆర్థికంగా ఉన్న వారికి మల్లి ఇల్లు కేటాయించారని ఆందోళన చేపట్టారు… కలెక్టర్ కు సైతం వినతి పత్రం అందజేశారు.

అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని సర్పంచ్ తెలిపితే మా ఇష్టం వచ్చిన వాళ్లకు ఇల్లు ఇస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బాధితులు తెలిపారు.. తమను గ్రామంలో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు… అధికారులు స్పందించి ఇప్పటికైనా  మాకు తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు…

గత పది రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా సర్పంచ్ రాజు తన సొంత నిర్ణయంతో తమను కాదని ఇతరులకు రెండు పడక గదులు కేటాయించారని, ఇండ్ల తాళాలు సైతం అందజేశారని బాధితులు వాపోయారు. ఒకరి వద్ద రెండు లక్షల వరకు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అర్హులైన వారికి అనుమతి పత్రం ఇవ్వకుండానే తనకు డబ్బులు ఇచ్చిన లబ్ధిదారులను మాత్రమే మే లు ఉండాలని సర్పంచ్ చెప్పారని లబ్ధిదారులు కూడా చెబుతున్నారు.

మాకు ఎలాంటి ఇంటి హక్కు పత్రాలు ప్రభుత్వం నుండి రా లేవని ఏ అధికారి కూడా మాకు చెప్పలేదని అయినా ఈ ఇంట్లో వచ్చి ఉంటున్నామని వీటన్నింటిని సర్పంచ్ చూసుకుంటానని ఇళ్లలో ఉంటున్న వారే మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మాకు సర్పంచ్ హక్కు పత్రాలు ఇస్తామని చెప్పాడని లబ్ధిదారులు చెబుతున్నారు. హక్కు పత్రాలు లేకుండా ఇళ్ళలో ఉండే అర్హత ఉండదని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్న వాటిని సర్పంచ్ బేఖాతరు చేసి తనకు డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే కేటాయిస్తున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. కూచన్పల్లి గ్రామంలోని లబ్ధిదారుల ఎంపిక పై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేసి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలని సర్పంచ్ పై కూడా చర్య తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Related posts

బావ మీద కోపంతో బాలకృష్ణ సినిమాకు అడ్డంకులు

Bhavani

పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే

Satyam NEWS

ఆంజనేయుని ఆశీస్సులతో అంతా సుఖసంతోషాలతో జీవించాలి

Bhavani

Leave a Comment