27.7 C
Hyderabad
April 26, 2024 04: 17 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి పట్టణంలో కరెంటు అప్రకటిత కోతపై ఫిర్యాదు

#wanaparthy

వనపర్తి జిల్లా కేంద్రంలో నెలకొన్న కరెంటు కష్టాలు, ఇతర ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు వివరించడానికి వెళ్లడంతో ఎస్. ఈ  అప్పుడే క్యాంపు వెళ్లారని తెలిసి ఫోన్ చేయడంతో, స్పందించిన ఎస్.ఇ.  టెక్నికల్ డిఇకి వినతిపత్రం ఇవ్వండి అని తెలుపడంతో, వారికి  వినతిపత్రం ఇచ్చామని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో కొద్ది రోజులుగా విద్యుత్ కోత ప్రజలకు తెలుపకుండానే జరుగుతుందన్నారు. అలాగే విలీన గ్రామాల్లో, కొన్ని వార్డులలో లో వోల్టేజ్ సమస్య ఉందని, చాలా వరకు కొత్త ట్రాన్స్ఫారంలు  ఏర్పాటు చేయాలని కోరారు. అంతేగాక ఇంత పెద్ద ఓనపర్తికి మూడు ఫీడర్లే ఉండడంతో చాలా సమస్యలు ఏర్పడుతున్నాయని ఇంకా రెండు ఫీడర్లు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని, విలీన గ్రామాల్లో కొన్ని వార్డులలో కరెంటు స్తంభాల కొరత తీర్చాలని కోరారు.

రోడ్డు వెడల్పులో భాగంగా వేస్తున్న కరెంటు స్తంభాలు అక్కడక్కడ నిబంధనలకు విరుద్ధంగా 20 ఫీట్లకి పాతడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన చేతివృత్తుల వారికి 200 యూనిట్ల లోపు ఉన్న బిల్లులు మాఫీ చేయాలని ప్రభుత్వం ప్రకటించిందని, అయినా కూడా ఇంకా బిల్లులు   చెల్లించాలని చెప్తున్నందున అది తొలగించాలని, ఈ సమస్యల పైన ఇంతకుముందే డి.ఈకి విన్నవించుకోవడం జరిగిందని ఇకముందు ప్రజల ఇబ్బందులు తొలగించడానికి, పైసమస్యలు పరిష్కరించకుంటే లోకాయుక్తకు ఆశ్రయించడం జరుగుతుందని ఈ సందర్భంగా  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎస్.పీ అధ్యక్షుడు జానంపేట రాములు, సిపిఐ కార్యదర్శి రమేష్, ప్రజల పార్టీ అధ్యక్షుడు అడ్వకేట్ ఆంజనేయులు  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ప్రశ్నించుకో

Satyam NEWS

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి చిన్నారెడ్డి

Satyam NEWS

అనుమతులులేని క్లినిక్‌, ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

Leave a Comment