29.2 C
Hyderabad
September 10, 2024 17: 18 PM
Slider తూర్పుగోదావరి

కాకినాడ కార్పొరేషన్ లో కోట్లు మింగిన వైసీపీ నేతలు

#vanamadikondababu

గత వైసిపి ప్రభుత్వ హయాంలో 2019 నుండి 20124 వరకు జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు మరియు స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగంపై విచారణ చేపట్టి తగు చర్యలు చేపట్టాలని కోరుతూ కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు శనివారం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులను ఇష్టానుసార రీతిలో దుర్వినియోగం చేశాడని, కాకినాడ నగర ప్రజలు తమ కష్టార్జితాన్ని పన్నుల రూపంలో కార్పొరేషన్ కు చెల్లిస్తే వాటిని సక్రమంగా ప్రజలకు ఉపయోగపడే పనులు నిర్వహించకుండా కాసుల కక్కుర్తితో కాకినాడ నగర ప్రజలకు సంబంధం లేని పనులకు వినియోగించి కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేశాడని పేర్కొన్నారు. కార్పొరేషన్ నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టి చవితిని తీసుకోవాల్సిందిగా కోరారు.

1. పేదలందరికీ ఇల్లు పథకం పేరుతో మాట భూములలో సుమారు 16 కోట్ల నగరపాలక సంస్థ మరియు కూడా నిధుల దుర్వినియోగంపై విచారణ.  

2. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా కాకినాడ నగరానికి చెందిన 600 కోట్ల రూపాయలతో 10 లేఔట్లకు సంబంధించిన భూసేకరణపై, గ్రావెల్ రోడ్లు ఫిల్లింగ్, గృహ నిర్మాణ పనులలో జరిగిన ఆవకతవకలపై విచారణ.   

3. నగరపాలక సంస్థకు చెందిన సామాజిక స్థలాల ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిన పట్టాలపై విచారణ.            

4. కాకినాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం నందు  స్మార్ట్ సిటీ నిధులతో పూర్తి చేసిన పనులకు కార్పొరేషన్ సాధారణ నిధులు కూడా వెచ్చించి ఒకే పండ్లు పై రెండు రకాల బిల్లులను తీసుకున్న విధానం పై విచారణ.           

5. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన లబ్ధిదారులు జాబితాలో ఉన్న ప్రాధాన్యత క్రమంలో ఉన్న అర్హులను తప్పించి అనర్హులకు కేటాయించిన మార్పులు చేర్పులు పై విచారణ.                          

6. 160 కోట్ల రూపాయల  సురేష్ నగర్ పార్క్  టిడిఆర్ బాండ్లపై విచారణ.

7. దుమ్ములపేట ప్రాంతం నందు 251 కోట్ల రూపాయల ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నిర్మాణ భూసేకరణ పై విచారణ.      

8. 2019 నుండి 2024 వర్క్ కాకినాడ నగర పరిధిలో మంజూరు చేసిన పిడిఎఫ్ బాండ్ల పై విచారణ.

9. ఆర్టీవో ఆఫీస్ రోడ్లో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాట్లులో నగరపాలక సంస్థ సాధారణ నిధులు నుండి కేటాయించిన 4 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం విచారణ.         

10. సుమారు 6 కోట్ల రూపాయలతో జగన్నాధపురం ఎన్టీఆర్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు పై విచారణ.                          

11. శానిటేషన్ కు సంబంధించిన సామాగ్రి కొనుగోలు వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, బచ్చు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

డివైన్ పవర్:జూన్‌ 23 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

Satyam NEWS

ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం

Satyam NEWS

ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

Sub Editor

Leave a Comment