30.7 C
Hyderabad
April 19, 2024 08: 43 AM
Slider నల్గొండ

హై హాండెడ్ నెస్: దివీస్ కంపెనీ దౌర్జన్యం పై మంత్రికి ఫిర్యాదు

talasani

చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం లో ని దివీస్ ఫార్మా కంపెనీ యాజమాన్యం రైతులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నదని రైతులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దివీస్ కంపెనీకి సంబంధించి 132 కెవి విద్యుత్ లైన్లు చౌటుప్పల్ సబ్ స్టేషన్ నుండి తమ పొలాల మీదుగా గా తీసుకెళ్తున్నారని అదే మని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మంత్రికి రైతులు ఫిర్యాదు చేశారు. సబ్ స్టేషన్ నుండి రోడ్డు వెంట కరెంటు లైన్ తీసుకు వెళ్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని తమ పొలాలు పైనుండి విద్యుత్ వైర్లను తీసుకెళ్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లైను అడ్డుకున్న రైతులపై  అక్రమ కేసులు పెట్టిస్తున్నారని వారన్నారు. దివిస్ ఫార్మా కంపెనీ యాజమాన్యం బలవంతంగా వచ్చి తమ పొలాల్లో కరెంటు స్తంభాల కోసం గుంతలు తవ్వుతున్నదని రైతులు మంత్రికి చెప్పారు. కరెంట్ లైను రోడ్డు మీదుగా తీసుకువెళ్లేట్టు చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను రైతులు కోరారు.

Related posts

పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే

Satyam NEWS

[Over-The-Counter] Triceratops Male Enhancement Best Pills For Erectile Dysfunction Height Xl Pills Review

Bhavani

ప్రయివేటు ఆసుపత్రుల్లో ఇంత ఎదవలు ఉంటారా???

Satyam NEWS

Leave a Comment