28.7 C
Hyderabad
April 25, 2024 05: 53 AM
Slider నల్గొండ

రాష్ట్ర వక్ఫ్ బోర్డు సి.ఈ.వో కి ముస్లిం సోదరులు ఫిర్యాదు

#waqfboard

డిఫాల్టర్స్ తొలగించి కొత్తవారికి దుకాణాలు కేటాయించాలని, మసీదు అభివృద్ధి కుంటుపడుతుంది సిబ్బందికి జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వక్ఫ్ బోర్డు రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ ఫారూఖీ కి ముస్లిం సోదరులు వినతిపత్రం అందజేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ఉస్మానియా మసీదు వక్ఫ్  షాపింగ్ కాంప్లెక్స్ లో అంటున్న కిరాయిదార్లు కొంతమంది వక్ఫ్ బోర్డు క్షేత్రస్థాయి అధికారులు డిఫాల్టర్స్ తో కలిసి పెంచిన కిరాయిలు వసూలు చేయకుండా ప్రభుత్వానికి,వక్ఫ్ బోర్డు కి,మసీదుకి, రావాల్సిన ఆదాయానికి భారీస్థాయిలో గండి కొడుతున్నారని,టర్మ్ కండిషన్ ప్రకారం నూతనంగా పెంచిన అద్దెలను మూడు నెలలు దాటినా కిరాయిలు  చెల్లించలేదని, సిఈవో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కిరాయిదారులు చెల్లించటం లేదని,దుకాణదారులు గడువు ముగిసినదని,వక్ఫ్ బోర్డు నియమ నిబంధనల ప్రకారం డిఫాల్టర్లను వెంటనే తొలగించి నోటిఫికేషన్ ద్వారా అర్హులైన ముస్లిం సోదరులందరికీ తక్షణమే దుకాణాలకు కేటాయించాలని హుజూర్ నగర్ పట్టణ ముస్లిం మైనారిటీ నేతలు వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎండీ.అజీజ్ పాషా,అబ్దుల్ రహీం పాషా,నవాబ్ జానీ,షేక్.మన్సూర్ అలీ,షేక్.బిక్కకన్ సాహెబ్, ఎండీ.మిల్లు రహీమ్,పఠాన్ గౌస్ ఖాన్, లైటింగ్ జానీ,ఫరీద్ అహ్మద్,మీరా, మజీద్, ఇబ్రహీం, రసూలు, వంట జానీ మిస్త్రీ, సిరాజ్,నయీమ్,జానీపాషా, మెయిన్, మక్సూద్, సలీం బాబా తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమావేశం

Satyam NEWS

‘దేశం’లో రోజా మనుషులకు ఇక కష్టకాలం

Satyam NEWS

చార్ ధామ్ యాత్ర: తెరుచుకున్న కేదార్ నాధ్ ఆలయం

Satyam NEWS

Leave a Comment