28.7 C
Hyderabad
April 20, 2024 03: 43 AM
Slider ఆదిలాబాద్

కంప్లయింట్: ప్రజా ఫిర్యాదులను వారంలో పరిష్కరించండి

nirmal collector

నిర్మల్ జిల్లాలో వివిధ శాఖల వద్ద పెండింగ్ లోని ప్రజా ఫిర్యాదులను వారం రోజుల్లోగా పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ సెల్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా  ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను జిల్లా అధికారులు పరిశీలించి పరిష్కారం అయ్యే వాటిని వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి కారణం సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. వివిధ శాఖలలో పెండింగ్ ఉన్న గ్రీవెన్స్ ను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

సారంగాపూర్ మండలం దాని గ్రామానికి చెందిన రాజేశ్వర్ ఆరోగ్యశ్రీ కార్డు, మరుగుదొడ్ల బిల్లు మంజూరుకై కుబీర్ మండలం డోడరన గ్రామానికి చెందిన ప్రభుత్వ చెరువు భూమిని ఆక్రమణ చేసిన వారిపై గైకొనాలని, బైంసా మండలం చెందిన ఈ. పోతన పథకం డబ్బులు ఇప్పించాలని, లక్ష్మణ్చందా మండలం చింతల తండ గ్రామానికి చెందిన ఇమామ్ పహాని మంజూరు చేయాలని కోరారు.

మమాడ మండలం  న్యూ సాంగ్వి గ్రామానికి చెందిన వెంకటి సాగు భూమి పట్టా మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎ.భాస్కరరావు, జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్ ఆడియోలు ప్రసూనాంబ, రాజు పాల్గొన్నారు.

ఇంకా జిల్లా అధికారులు డిపిఓ శ్రీనివాస్ జిల్లా పరిషత్ సిఇఒ సుధీర్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి ప్రణీత, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సురేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

హైద‌రాబాద్ లో అందుబాటులోకి క్వాంట‌మ్ సేవ‌లు

Bhavani

ఎమ్మార్వో సమక్షంలోనే డబ్బుల కోసం తన్నుకున్న వీఆర్వోలు

Satyam NEWS

మా పల్లె సంక్రాంతి

Satyam NEWS

Leave a Comment