28.2 C
Hyderabad
April 20, 2024 12: 35 PM
Slider పశ్చిమగోదావరి

మందుబాబులకు అడ్డాలుగా మారిన కంపోస్టు షెడ్ లు

#compostshead

పశ్చిమ గోదావరిజిల్లాలో  లక్షలాది రూపాయలతో  నిర్మించిన కంపోస్టు షెడ్ లు  మందు బాబులకు అడ్డాలుగా మాఋతున్నాయి.

పంచాయతీలలో తడి చెత్త.పొడి చెత్త ను గ్రీన్ వెహికల్ ద్వారా ఊరికి దూరంగా నిర్మించిన కంపోస్టు షెడ్ లకు తరలించి తడి చెత్తను వానపాముల పెంపకానికి వర్మీ కంపోస్టు గా ఉపయోగించి పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా, పొడి చెత్తనుండి ఇనుము, రేకులు, సీసాలు, గాజు పెంకులు, పగిలిన ప్లా స్టిక్  రబ్బరు   ముక్కలను వేరుచేసి వాటి పై కూడా పంచాయతీలు వ్యాపారం చేసి ఆర్థిక పరి పుష్టి పొందాలనేది ఈ కంపోస్టు షెడ్ ల ఏర్పాటు ముఖ్యోద్దేశము.

వీటి నిర్మాణానికి ఒక్కో పంచాయతీ కి 4 నుండి 6 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందని సమాచారం. వీటిని నిర్మించిన నాటినుండి నేటివరకు తడి చెత్త నుండి పొడి చెత్తనుండి ఏ పంచాయతీ కూడా ఒక్కరూపాయి ఆదాయాన్ని సంపాదించలేదని, వాటి నిర్మాణమే ప్రశ్నఅర్ధకంగా మారిందని పంచాయతీ కార్యదర్శులు తెలుపుతున్నారు.

కొన్ని గ్రామాలలో ఈ షెడ్ లు అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారాయనేది సమాచారం. గ్రామాలలో ఏళ్ళ తరబడి నిరుపయోగంగా ఉన్న ఈ షెడ్ ల పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి

Related posts

భద్రాద్రి రామచంద్రుడికి శాస్త్రోక్తంగా మహాపట్టాభిషేకం

Satyam NEWS

భూకబ్జా పై నిరసన సెగ: సీపీఎం ధర్నా

Satyam NEWS

వ్యవసాయ కార్పొరేషన్లు సాంకేతికను అందిపుచ్చుకోవాలి

Satyam NEWS

Leave a Comment