39.2 C
Hyderabad
March 29, 2024 15: 40 PM
Slider ముఖ్యంశాలు

రాజీమార్గం… రాజమార్గం:న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయవాదులు

#lawofficers

ప్రజలు  కోర్టు ఖర్చులు, సమయపాలన  అనవసరంగా వృధా చేసుకోకుండా రాజితోనే కేసుల సమస్య పరిష్కారం చేసుకోవాలని న్యాయ విజ్ఞాన సదస్సులో కొల్లాపూర్ న్యాయవాది అర్. కురుమూర్తి, లోక్ అదాలత్ న్యాయవాదులు ప్రజలకు అవగాహన కల్పించారు.

శనివారం కొల్లాపూర్ మున్సిపాలిటీ 15 వ వార్డు చౌట బెట్లలో లోక్ ఆదాలత్ సభ్యుల అధ్యక్షతన కౌన్సిలర్ పొడెండ్ల  సత్యం సహకారంతో  ప్రజలకు న్యాయ విజ్ఞాన సదస్సు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా  న్యాయవాది అర్. కురుమూర్తి  లోక్ అదాలత్ ఉద్దేశాలను తెలియజేశారు.

రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే ఇరుపక్షాలు విజేతలుగా నిలుస్తారని తెలిపారు. ఇరువురు గెలిచినట్లే అని ఆయన అన్నారు. సమయాభావం,అనవసర కోర్టు ఖర్చులను ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రాజీ మార్గమే రాజ మార్గము అని ప్రజలకు సూచించారు.

అదేవిధంగా లోక్  అదాలత్ సభ్యులు మోహన్ లాల్ ఉచిత న్యాయ సలహాలు, న్యాయ విజ్ఞాన సదస్సు  ఉద్దేశాలను తెలిపారు.N I  యాక్ట్ కేసులు, బాల్య వివాహాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, మోటార్ వాహనాల చట్టాలు, ప్రాంసరీ నోటు ఇతర చట్టాల గురించి సీనియర్ న్యాయవాది మధుసూదన్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సత్యం లోక్ అదాలత్ సిబ్బంది భోగ హరికృష్ణ, కోర్టు కానిస్టేబుల్ బాలు నాయక్, కోర్టు సిబ్బంది రఘురాం, లీగల్ వాలంటరీ మధుసూదన్  వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Related posts

అమెరికా గగనతలంలో ఆగని అనుమానాస్పద వస్తువుల కదలిక

Satyam NEWS

వాట్ ఈజ్ దిస్: టీచర్లను మాసికంగా వేధిస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

విక్టరీ‌ వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్‌తో ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని ‘క్రాక్‌’

Satyam NEWS

Leave a Comment