27.7 C
Hyderabad
April 26, 2024 04: 08 AM
Slider వరంగల్

నర్సరీలలో మొక్కలు అనుకున్న మేరకు పెంచాలి

#Mulugu Dist

నర్సరీలో పెంచే మొక్కలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎదుగుతాయని వరంగల్ సీసీఎఫ్ ఎంజె అక్బర్ అన్నారు. ములుగు రేంజ్ పరిధిలోని జాకారం నర్సరీ ని నేడు ఆయన పరిశీలించారు. విత్తనాలు పెట్టినప్పుడు తప్పనిసరిగా నీళ్లు చల్లాలని కలుపు మొక్కలను మొదట్లోనే గుర్తించి తొలగించాలని అన్నారు.

నర్సరీలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి వివరించారు. ప్రైమరీ బెడ్స్ పెంపకం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మొక్కల ఎదుగుదల విషయంలో జీవమృతం తగు సమయంలో అందించాలని సిబ్బందికి సూచించారు. 20 రకాల సీడ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

మొక్కలు పొడవుగా పెరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నర్సరీలో పెంచే మొక్కల లక్ష్యాలను తప్పనిసరిగా అధిగమించాలి అన్నారు. ఆయన వెంట ములుగు డీ. ఎఫ్.వో ప్రదీప్ కుమార్ శెట్టి, ములుగు ఎఫ్.డీ. వో నిఖిత, ములుగు రేంజ్ ఆఫీసర్ రాం మోహన్, సెక్షన్ ఆఫీసర్ రవీందర్, బీట్ ఆఫీసర్ అనిల్ ఉన్నారు.

Related posts

నేటి నుంచి హైదరాబాద్ లో సూపర్ స్ప్రె డర్స్ కు కరోనా వ్యాక్సిన్

Satyam NEWS

ఎఫ్‌.3 : పూజా హెగ్డే పార్టీ సాంగ్ షూటింగ్ ప్రారంభం

Satyam NEWS

హుజూరాబాద్ దళితబంధు కోసం రూ.2 వేల కోట్లు విడుదల

Satyam NEWS

Leave a Comment