వికారాబాద్ జిల్లా తాండూర్ మునిసిపల్ మాజీ చైర్మన్ నాగారం నర్సింహులు మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. వారు తనకు అత్యంత సన్నిహితులని, వారి సేవా భావన, నమ్రత, వినయం కలిగిన నాయకులని, తాండూర్ పట్టణం అభివృధ్ధి కోసం అనేక పధకాలు చేపట్టారని వారి సేవలను కొనియాడారు. నాగారం నర్సింహులు జాతీయ భావాన్ని, దేశ భక్తిని నమ్ముకొని, దానికోసమే నిరంతరం కృషిచేశారని, బలహీన వర్గాల నుంచి వచ్చి రాజకీయంలో ఎదగడం, ప్రజాసేవ అందించి మంచి నాయకునిగా పేరు గడించడం గొప్ప విషయమని దత్తాత్రేయ అన్నారు. నాగారం నర్సింహులు మరణం వల్ల వికారాబాద్ జిల్లా ఒక మంచి నాయకున్ని కోల్పోయిందని, వారి మృతి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని లోటు అని, వారి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని, ఈ కష్ట సమయాన ఈ బాధను తట్టుకోవడానికి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
previous post