సిద్దిపేట కు చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ పరందాములు (పెద్దకోడూరు) వెంకటేశ్వర్లు (గాడి చెర్ల పల్లి) రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా మృతి పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని తెలియజేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతు పోలీస్ ఉద్యోగం లో నిబద్దత కలిగిన యువ కానిస్టేబుల్స్ మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. కానిస్టేబుల్ ఉద్యోగుల గా కాకుండా సామాజిక సేవకులుగా, వీరు యువకులకు ఎంతో స్ఫూర్తి నిచ్చారని, సిద్దిపేట లో జరిగిన హాఫ్ మారతాన్ యువకుల్లో ఎంతో చైతన్యం తెచ్చారని ఉచిత కానిస్టేబుల్ కొంచింగ్, ఇతర సామాజిక సేవల్లో వారు అందించిన సేవలను కొనియాడారు. ఇంకా సమాజం లో ఎన్నో చేయాల్సిన వీరికి ఇలా జరగడం చిన్న వయస్సులోనే తీరని లోకానికి వెళ్లడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానాని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
previous post