31.2 C
Hyderabad
April 19, 2024 05: 19 AM
Slider సంపాదకీయం

కన్ఫ్యూజన్: మార్చి 31 లోపు బడ్జెట్ ఆమోదం పొందుతుందా?

jagan 06

మార్చి 31 లోపు ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి. లేకపోతే విపరీత పరిణామాలు తలెత్తుతాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకూ ప్రభుత్వంలో క్లారిటీ లేదు. మార్చి 31 లోపు బడ్జెట్ ఆమోదం పొందకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం స్థంభించిపోతుంది.

ఒక్క పైసా ఖర్చు చేయడానికి వీలుకాదు. రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుంది. ఇంత కీలక మైన ఈ అంశంపై నేటి వరకూ క్లారిటీ రాలేదు. ఈ నెల 29 వరకూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంపిటిసి జెడ్ పిటిసి ఎన్నికల పోలింగ్ పూర్తి అయి కౌంటింగ్ మొదలు పెట్టేది 24వ తేదీ. మునిసిపల్ ఎన్నిల కౌంటింగ్ పూర్తి అయ్యేది 27న గ్రామ పంచాయితీ తొలి దశ కౌంటింగ్ 27న, రెండో దశ కౌంటింగ్ 29న జరుగుతుంది.

24న ఎంపిటిసి, జెడ్ పి టిసి ఎన్నికలు పూర్తి అయితే ఆ త్వరాత మండలాధ్యక్షుల ఎన్నికలు జరగాలి. జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికలు పూర్తి కావాలి. అందుకు కోరం నిబంధనలు ఉంటాయి. అదే విధంగా మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత అంటే 27 తర్వాత చైర్మెన్ ల ఎన్నికలు జరగాలి.

ఈ అన్ని ఎన్నికలలో ఎమ్మెల్యేలు, ఎంపిలు ప్రముఖ పాత్ర పోషించాలి. ఎక్స్ అఫిషియో సభ్యులుగా వారికి ఓటు హక్కు ఉంటుంది. గ్రామ పంచాయితీ ఎన్నికలకు ఎమ్మెల్యేలు లేకపోయినా ఫర్వాలేదు. అంటే మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ తర్వాత 28, 29 వ తేదీలలో ఎమ్మెల్యేలకు సంబంధిత మునిసిపాలిటీలలో పూర్తి స్థాయిలో యాక్టివిటీ ఉంటుంది.

27 లోపు అంటే 25, 26 తేదీలలో జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ ఎన్నికలు పూర్తి చేసుకోవాలి అప్పటి వరకూ రూరల్ ప్రాంత ఎమ్మెల్యేలు బిజీగా ఉంటారు. మొత్తానికి చూస్తే ఈ నెల 29 వరకూ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో బిజీగా ఉంటారు. మరి అసెంబ్లీ ఎప్పుడు పెడతారు? బడ్జెట్ ఎప్పుడు ఆమోదిస్తారు? ఇవన్నీ కాదని ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెషన్స్ కు పిలిచేస్తారా? లేక 24, 27 పోలింగు పూర్తి అయిన తర్వాత జెడ్ పి చైర్మన్, ఎంపిపి చైర్మన్, మునిసిపల్ చైర్మన్ ల ఎన్నికలు వాయిదా వేస్తారా? తెలియదు. పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్ రాజ్యమేలుతున్నది.

Related posts

కోతుల సంరక్షణకు గండి రామన్న హరితవనం

Satyam NEWS

నట దిగ్గజాలకు మార్గదర్శకుడు ఇక లేరు

Satyam NEWS

జర్నలిస్టులకు అండగా ఉంటాం: మంత్రి హరీష్ రావు

Satyam NEWS

Leave a Comment