21.7 C
Hyderabad
December 4, 2022 00: 30 AM
Slider ముఖ్యంశాలు

రాహుల్ ను సద్దాంతో పోల్చడం పై కాంగ్రెస్ ఆగ్రహం

భారత్ జోడో యాత్రలో నిమగ్నమై ఉన్న రాహుల్ గాంధీ గడ్డం పెంచడాన్ని ఎద్దేవ చేస్తూ సద్దాం హుస్సేన్ తో పోల్చడం బీజేపీ విభజన రాజకీయాలకు నిదర్శనమని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి అన్నారు. బీజేపీకి చెందిన ఆసోమ్ ముఖ్యమంత్రి బిస్వా శర్మ రాహుల్ గాంధీ గడ్డంపై ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతుందనేదానికి ఇది నిదర్శనమని డాక్టర్ మల్లు రవి అన్నారు.

భారత్ జోడో యాత్ర చేయడం కూడా ఇందుకేనని, మతాలుగా విడిపోయిన ప్రజలను కలిపేందుకు, భారత్ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ గాంధీ ఎంతో శ్రమకోర్చి భారత్ జోడో యాత్ర చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికి రెండువేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అంటే అది రాహుల్ గాంధీ సంకల్పానికి నిదర్శనమని డాక్టర్ మల్లు రవి అన్నారు. మరొక్క సారి బీజేపీ ఈ విధంగా రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

Related posts

దేశ ప్రత్యామ్నాయ రాజకీయాల్లో కీలకశక్తి గా బీఆర్ఎస్

Satyam NEWS

ప్రభుత్వం చెయ్యలేదు… కానీ మేము చేస్తున్నాం: జనసేన పార్టీ నేత యశస్వి

Satyam NEWS

అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!