కాగజ్నగర్ పట్టణం కిమ్స్ హాస్పిటల్ ఆడిటోరియంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరిబాబు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో పార్టీ ఘన విజయం సాధించి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డాజీ, పార్టీ కార్యకర్తలు, నాయకుల విశేష కృషి వల్ల ఈ విజయం సాధ్యమైంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ 8 స్థానాలు గెలుచుకుని అద్భుత విజయం సాధించిందని వక్తలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేయడం వల్లే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని వారన్నారు.
previous post
next post